AP Politics : మా ఓటమికి కారణం పవన్ : వైసీపీ ఎమ్మెల్సీ సంచలన ఇంటర్వ్యూ
ఉభయ గోదావరి జిల్లాల వరకే తమ ఫ్యాక్టర్ ఉంటుందని అనుకున్నామని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. కూటమి విజయానికి ప్రధాన కారకుడు పవన్ కల్యాణే అని అన్నారు. పవన్ విషయంలో తమ అంచనాలు తప్పాయని.. అందుకే ఓడిపోయామన్నారు.