Vizag: విశాఖలో గుప్తు నిధుల తవ్వకాలు..!
విశాఖ నగరం నడిబొడ్డులో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో.. తాటిచెట్ల పాలెం రైల్వే క్వార్టర్స్‌లో ఇంటి ఆవరణంలో రైల్వే ఉద్యోగి ఆధ్వర్యంలో పూజలు చేసి 20 అడుగుల గొయ్యి తవ్వేశారు.
విశాఖ నగరం నడిబొడ్డులో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో.. తాటిచెట్ల పాలెం రైల్వే క్వార్టర్స్‌లో ఇంటి ఆవరణంలో రైల్వే ఉద్యోగి ఆధ్వర్యంలో పూజలు చేసి 20 అడుగుల గొయ్యి తవ్వేశారు.
అల్లూరి జిల్లా అరకులోయ టూరిజం ఐ టి. డి.ఏ కార్మికులు మెరుపు సమ్మె చేపట్టారు. కార్మికులను పర్మినెంట్ చేయాలని, పనికి తగ్గ జీతం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మె కారణంగా ఐటీడీఏ పరిధిలో ఉన్న టూరిస్ట్ ప్రాంతాలు మూతపడటంతో పర్యాటకులు అయోమయంలో పడ్డారు.
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న రెండు రోజుల్లో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
టీడీపీ నేత లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర యాదవులను బీసీ-బీలో చేర్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. టీడీపీ పార్టీ అధికారంలోకి రాబోతుందని అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రోడ్లు వేస్తామని అన్నారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో అంగన్వాడీల ఆందోళన 5వ రోజు కొనసాగింది. ఈ కార్యక్రమానికి మద్దతూ తెలిపి దీక్షలో పాల్గొన్నారు టీడీపీ మహిళ నాయకురాలు వంగలపూడి అనిత. ఉల్లి గడ్డకు, ఆలు గడ్డకు తేడా తెలియని జగన్ కు అంగన్వాడీల కష్టాలు ఎలా తెలుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"కేంద్రంలో నరేంద్ర మోదీని గద్దె దించాలి, రాష్ట్రంలో జగన్ ను ఇంటికి పంపించాలి"..ఇదే మా ప్రధాన ఉద్దేశ్యమని సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ రామకృష్ణ. వీటి కోసం ఏ పార్టీ ముందుకు వచ్చిన కలుపుకొని వెళ్తామని తేల్చి చెప్పారు.
జిల్లా కలెక్టర్లు జోక్యం చేసుకోని అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లలన్నారు టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు. అంతేకానీ దౌర్జన్యంగా అంగన్వాడి సెంటర్ల తాళాలను పగలగొట్టే పనులు చేస్తే కలెక్టర్ల కార్యాలయాలకు తాళాలు వేస్తామని హెచ్చరించారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్రపై కౌంటర్లు వేశారు అనకాపల్లి వైసీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్. యువగళం పాదయాత్ర కామెడీ యాత్ర అని ఎద్దెవ చేశారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు జగన్ పాదయాత్రను చూసి లోకేష్ పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందని చురకలు వేశారు.
విశాఖపట్నం జిల్లా కేంద్రంలోని జగదాంబ జంక్షన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇండస్ ఆస్పత్రిలోని రెండో అంతస్థులో ఈ మంటలు చెలరేగడంతో రోగులు భయంతో పరుగులు తీశారు. పలువురు రోగులు మంటల్లో చిక్కుకోగా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.