DANA Toophan:
బంగాళాఖాతంలో తీవ్ర తుపాను దానా ముప్పు పొంచి ఉండటంతో ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలను భారత వాతావరణశాఖ అప్రమత్తం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలపడింది. బుధవారం ఉదయానికి తుపానుగా , గురువారం తెల్లవారుజామున తీవ్ర తుపానుగా మరే అవకాశాలున్నాయని ఐఎండీ చెప్పింది. గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం ఉదయంలోగా పూరీ, సాగర్ ద్వీపం మధ్యలో తీరం దాటొచ్చని భావిస్తోంది. తుపాను ప్రభావం ఏపీ పై అంతగా ఉండకపోవచ్చు. ప్రస్తుత అంచనా ప్రకారం ఒడిశా, పశ్చిమబెంగాల్ స్థానిక పరిస్థితుల వల్ల వాయుగుండం గమనం మార్చుకుంటే బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశాలున్నాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
Also Read: Russia: మరో యుద్ధానికి సిద్ధం... రష్యా గడ్డపై నార్త్ కొరియా బలగాలు!
Also Read: నాంపల్లి స్పెషల్ కోర్టులో స్టేట్‌మెంట్ ఇచ్చిన కేటీఆర్.. ఏమన్నారంటే ?
రైళ్ళ రద్దు..
ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే దాదాపు 200 రైళ్ళ సర్వీసులను రద్దు చేసింది, దారి మళ్లించింది. 23, 24, 25, 26, 27, 29 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య కేంద్రాల్లో రైళ్ల రాకపోకల సమాచారం కోసం 17 ఊళ్ళల్లో హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు.
Also Read: ఏపీలో మందుబాబులు ఎగిరి గంతేసే వార్త.. రూ.99కే క్వార్టర్ అమ్మకాలు షురూ!
మరోవైపు ఒడిశా తుఫానుతో అప్రమత్తమయింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే 23వ తేదీ నుంచి 25 వరకు జరగాల్సిన పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. ఈ నెల 27న జరగాల్సిన ఒడిశా సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షను సైతం వాయిదా వేశారు. అలాగే జాతీయ పార్కులను , జూలను మూసేశారు.
ఇది కూడా చదవండి: AP: టెన్త్ విద్యార్థులకు అలర్ట్..పరీక్షా విధానంలో మార్పులు!