నన్ను టచ్ చేస్తావా..? పోలీసులను అఘోరీ ఏం చేసిందో చూడండి లేడీ అఘోరీ నాగసాధువు వైజాగ్‌లో అడుగుపెట్టింది. ఓ కొండపై రహస్య పూజలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. నిన్న నక్కపల్లి టోల్‌గేట్ దగ్గర కారు ఆపేసి హంగామా చేసింది. పోలీసులు తనను చేతులు పట్టి తోసేశారని.. తనపై చేయి వేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. By Archana 05 Nov 2024 in వైజాగ్ Latest News In Telugu New Update aghori షేర్ చేయండి Lady Aghori: లేడీ అఘోరీ నాగసాధువు ఎపిసోడ్ తెలంగాణలో సంచలనంగా మారింది. కొన్ని రోజుల క్రితం తెలంగాణాలో అడుగుపెట్టిన అఘోరీ పలు ఆలయాలను సందర్శిస్తూ వస్తోంది. అయితే ఇటీవలే ఆత్మార్పణ చేసుకుంటానని అఘోరి సంచలన ప్రకటన చేయడంతో.. ముందస్తు జాగ్రత్తగా ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంట్లోనే నిర్బంధించారు. Also Read: చిరు, నాగ్, వెంకీలో నాకు ఇష్టమైన హీరో అతనే.. బాలయ్య భలే చెప్పాడుగా! వైజాగ్ లో అడుగుపెట్టిన అఘోరి ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చిన అఘోరీ.. తాజాగా వైజాగ్ లో అడుగుపెట్టింది. వైజాగ్ జోడుగుళ్ళపాలెంలో హల్‌చల్ చేసింది. నిన్న నక్కపల్లి టోల్‌గేట్ దగ్గర కారు ఆపేసి.. నిరసనకు దిగింది. పోలీసులు వచ్చి చెప్పినా వినకుండా.. అక్కడి నుంచి కదిలేది లేదని మొండికేసింది. పోలీసులు తనను చేతులు పట్టి తోసేశారని... తనపై చేయి వేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. దీంతో అఘోరీని చూసేందుకు పెద్దయెత్తున జనం వచ్చారు. అయితే అఘోరీ ఓ కొండ పై రహస్య పూజలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే పలు ఇంటర్వ్యూస్ లో అఘోరీ చెప్పిన విషయాలకు నెటిజన్లు షాక్ అయ్యారు. తాము శవాలను తింటామని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తన ప్రాణాలనైనా అర్పిస్తానని చెప్పుకొచ్చింది. అందులో భాగంగానే నవంబర్ 1న సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి దగ్గర ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు అఘోరీని అదుపులోకి తీసుకుని తన స్వగ్రామమైన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుషన్‌పల్లికి తీసుకెళ్లారు. అక్కడ రెండు రోజుల పాటు అఘోరీని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆపై రీసెంట్‌గా మహారాష్ట్ర సరిహద్దుల్లో వదిలిపెట్టారు. Also Read: వరుణ్, లావణ్య మొదటి పెళ్లిరోజుకు మెగాస్టార్ అదిరిపోయే గిఫ్ట్!.. వీడియో వైరల్ Also Read: హీరో విజయ్ దేవరకొండకు ప్రమాదం.. VD12 షూటింగ్ లో అలా..! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి