Crime News: మద్యం మత్తులో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తి..!

మద్యం మత్తులో స్నేహితుడిని హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ దారుణమైన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. సెల్ ఫోన్ వివాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పక్క ప్లాన్ తోనే స్నేహితుడిని కృష్ణ నది దగ్గరకు తీసుకుని వెళ్లి కత్తితో పొడిచి చంపాడు.

New Update
Crime News: మద్యం మత్తులో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తి..!

Crime News: విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో స్నేహితుడిని హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ హత్యకు సెల్ ఫోన్ వివాదమే కారణం అని తెలుస్తోంది. కృష్ణ నది దగ్గరకు తీసుకుని వెళ్లి స్నేహితుడుని కత్తితో హత్య చేశాడు. అసలేం జరిగిందంటే..?

నిన్న ఉదయం శివ, స్వామి, కనక అనే ముగ్గురు స్నేహితులు మందు పార్టీ చేసుకున్నారు. అయితే, తాగే క్రమంలోనే వీరి ముగ్గురి మధ్య సెల్ ఫోన్ అమ్మె విషయంలో వివాదం చలరేగినట్లు తెలుస్తోంది. ఓ సెల్ ఫోన్ తీసుకువచ్చిన స్వామి దానిని అమ్మమని కనకను అడిగాడు. దీంతో, రెండు రోజుల్లో అమ్మి డబ్బులు ఇస్తాను అని చెప్పాడు కనక.

Also read: యోధుడిగా భక్త కన్నప్ప..ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్

అయితే, అప్పటికే ఫుల్ గా తాగి ఉన్నముగ్గురు ఉన్నట్టుండి గొడవ పడ్డారు. కనకాను బూతులు తిట్టాడు స్వామీ. మద్యం మత్తులో ఉన్న శివ..ఎవరిని తిడుతున్నవ్ అని ఫోన్ లాక్కుని నేలకేసి కొట్టాడు. అంతే, సెల్ ఫోన్ పగలగొట్టాడని బాగా ఆవేశం పెంచుకున్నాడు. కోపంను కంట్రోల్ చేసుకోలేకపోయాడు స్వామి. శివని చంపాలని డిసైడ్ అయ్యాడు.

మరో ఇద్దరు స్నేహితులతో కలిసి శివను చంపాలని స్కెచ్ వేశాడు. పక్క ప్లాన్ తో సాయంత్రం శివను కృష్ణ నదికి తీసుకుని వెళ్లాడు. అనుకున్న ప్రకారంగానే ఇద్దరు స్నేహితులతో కలిసి శివను కత్తితో పొడిచి చంపాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్వామిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు