Ambati Rambabu: మంత్రి రజినీ ఆఫీసు పై దాడి దుర్మార్గం: అంబటి రాంబాబు!
ఏపీ మంత్రి విడదల రజినీ ఆఫీసు పై దాడి చేయడం దురదృష్టకరమంటూ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు
ఏపీ మంత్రి విడదల రజినీ ఆఫీసు పై దాడి చేయడం దురదృష్టకరమంటూ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు
తమ సమస్యలు పరిష్కారించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరసన కార్యక్రమం 21వ రోజుకు చేరుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా ముగ్గులు వేసి వినూత్నంగా నిరసన చేపట్టారు
మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలపై జనసేన నేత పోతిన మహేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ పై నోటికి వచ్చినట్లు మాట్లాడితే దవడలు పగిలిపోతాయని వార్నింగ్ ఇచ్చారు. ఇళ్లు నిర్మానం పేరుతో కేంద్రం డబ్బులు వేల కొట్లు కొట్టేసి మీ బిల్డప్ ఏంటి? అని మండిపడ్డారు.
టీడీపీ, జనసేన పొత్తు ఫిక్స్ కావడంతో తమ టికెట్ ఎక్కడ పోతుందోనని అనుమానం ఉన్న టీడీపీ నేతలు పవన్, నాగబాబు చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. పొత్తుల్లో తమ టికెట్ అడగొద్దని వారు రిక్వెస్ట్ చేస్తున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వైసీపీకి షాక్ తగిలింది. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైఖరిని నిరసిస్తూ రాజీనామా చేశారు మాజీ మండల అధ్యక్షుడు బొమ్మసాని చలపతిరావు. పార్టీ కోసం పనిచేసిన తనకు గుర్తింపు ఇవ్వకపోవడంపై బొమ్మసాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనవరి 3న కాంగ్రెస్‌లోకి YS షర్మిల చేరనున్నారు! ఆమెతో పాటు పలువురు కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరుతారు. కర్ణాటక డిప్యూటీ సీఎం ఈ మేరకు పావులు కదిపారు. అయితే షర్మిను ఏపీ పీసీసీ అధ్యక్షురాలిని చేస్తారా..? రాజ్యసభ సీటు కేటాయిస్తారా..? అన్నది రాహుల్‌తో భేటీలో తేలనుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ మునిగిపోయే నావ..దాన్ని ఎవరూ కాపాడలేరని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వారిలో వారికే తిరుగుబాటు మొదలైంది. అందుకే వారి ఎమ్మెల్యేలు, ఎంపీలు చెట్టుకోకరు..పుట్టకోకరు అన్నట్లు మిగిలారు అని విమర్శించారు.
మున్సిపల్ కార్మికుల ధర్నా నేపథ్యంలో శానిటేషన్ బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ అయినట్లు అధికారిక సమాచారం అందుతోంది.
విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని శివనాధ్(చిన్ని)కి నారా లోకేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో చిన్ని చేపడుతున్న కార్యక్రమాలను చూసి మెచ్చుకున్న లోకేశ్ బెజవాడ పార్లమెంట్ బాధ్యతలు అప్పగించారు. టీడీపీని మరింత బలపరచాలని చిన్నికి చెప్పారు లోకేశ్.