Kodali Nani: రేవంత్ రెడ్డి ఏమైనా సుప్రీమా..వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
కేసీఆర్ కి తుంటి ఎముక విరిగింది కాబట్టి జగన్ ఆయనను పరామర్శించారు. రేవంత్ రెడ్డికి తుంటి ఎముక విరగలేదు కదా అంటూ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ కి తుంటి ఎముక విరిగింది కాబట్టి జగన్ ఆయనను పరామర్శించారు. రేవంత్ రెడ్డికి తుంటి ఎముక విరగలేదు కదా అంటూ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సంక్రాంతి స్పెషల్ రైలులో అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. సాధారణ రైలులో మాత్రం రెగ్యులర్ ఛార్జీలు ఉంటాయని సీపీఆర్వో తెలిపారు. ఈ సారి ఫ్లాట్ ఫాం టికెట్ కు అదనపు ఛార్జీలు వసూలు చేసేది లేదని ప్రకటించారు.
వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై అలాగే ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్‌లపై అనర్హత వేటు వేయాలని స్పీకర్, మండలి ఛైర్మన్‌కు ఆ పార్టీ ఫిర్యాదు చేసింది.
ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయిన లగడపాటి రాజగోపాల్ మరోసారి చర్చనీయాంశమయ్యారు. లగడపాటి మాజీ ఎంపీ హర్షకుమార్ ఇద్దరు కలిసి మరో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంటికి వెళ్లారు. వీరు ముగ్గురు కలయిక ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఏపీలో మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం పర్యటించనుంది. ఏపీకి వస్తున్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని మంగళవారం నాడు చంద్రబాబు పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా కలవనున్నారు. ఓటరు జాబితాపై మిస్టేక్స్ తదితర అంశాలపై వీరు చర్చించనున్నారు.
కేశినేని కుమార్తె, కార్పొరేటర్ కేశినేని శ్వేత తన పదవికి రాజీనామా చేశారు. పార్టీని విడిచి పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదని..కానీ పార్టీకి మేము వద్దు అనుకున్నప్పుడూ ఇంకా పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని ఆమె పేర్కొన్నారు.
తిరువూరు టీడీపీ బహిరంగ సభకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరలిరాగా.. అక్కడ తారక్ అభిమానులకు టీడీపీ కార్యకర్తలకు గొడవ జరిగింది. ఈ క్రమంలో జూనియర్ ఫ్యాన్‌ను టీడీపీ కార్యకర్త కొట్టాడు.
ఈ రోజు పార్టీకి, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం అవుతున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేత.. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు రాజకీయంగా సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఏపీలో నేడు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించనుంది. ప్రస్తుత ప్రభుత్వం వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ రెండూ కూడా ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని కంప్లైంట్లు చేయడంతో ఆంధ్ర మీద ఫోకస్ పెట్టింది ఈసీ. ఇవాల్టి నుంచి మూడు రోజులపాటూ ఏపీలో పర్యటించనుంది.