Gold Prices : పండుగ వేళ భారీగా తగ్గిన బంగారం ధరలు..వెంటనే కొనేయండి మరీ!
పసిడి ప్రియులకు ఓ గుడ్ న్యూస్. బంగారం ధరలు నిన్నటి ధరలతో పోలిస్తే శుక్రవారం నాడు ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర రూ. 100 కిందకి దిగి వచ్చింది
పసిడి ప్రియులకు ఓ గుడ్ న్యూస్. బంగారం ధరలు నిన్నటి ధరలతో పోలిస్తే శుక్రవారం నాడు ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర రూ. 100 కిందకి దిగి వచ్చింది
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. మరో 4 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. సికింద్రాబాద్-నరసాపూర్, నరసాపూర్-హైదరాబాద్, హైదరాబాద్-శ్రీకాకుళం రోడ్, శ్రీకాకుళం రోడ్-హైదరాబాద్ మార్గాల్లో ఈ ట్రైన్లు నడపనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
వైసీపీ అధినేతకు మరో షాక్ తగిలింది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలోకి చేరనున్నట్లు సమాచారం. పేర్ని నానితో బాలశౌరికి గత కొంతకాలంగా వైరం నడుస్తుంది.
మా కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్న ఒక సమస్య తీరిపోయింది అంటున్నారు కేశినేని నాని తమ్ముడు చిన్ని. ఎవరో ఒకరిద్దరు అనామకులు వెళ్ళిపోతే పార్టీకి ఏమీ నష్టం లేదని..విజయవాడ ప్రజలు టీడీపీ వైపే ఉంటారని చెప్పారు కేశినేని చిన్ని.
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు జర్నీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమల రావు వివరించారు. ఈ విషయం గురించి ఏపీ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.
ఏపీలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా ప్రచురణ జరుగుతుందని తెలిపారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు.
పవన్ కల్యాణ్‌తో భేటీపై సోషల్ మీడియాలో స్పందించారు అంబటి రాయుడు. పాలిటిక్స్ ను వదిలేద్దామనుకున్నా..కానీ ఫ్రెండ్స్ సలహా ద్వారా పవన్ ను కలిసినట్లు తెలిపారు. ఈ సందర్భంగానే వైసీపీ సిద్ధాంతాలు నచ్చకే పార్టీకి రాజీనామ చేశానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
కేశినేని కామెంట్స్ కు బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. నీ రాజకీయ జీవితం కోసం చంద్రబాబు గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతావా? అంటూ ఫైర్ అయ్యారు. నువ్వేంటి..నీ స్థాయి ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పిల్లలపై ఒట్టేసి చెబుతున్నా..చంద్రబాబు నాతో తిట్టించలేదంటూ కామెంట్స్ చేశారు.
టీడీపీకి గుడ్ బై చెప్పిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ రోజు తన కుమార్తె శ్వేతతో కలిసి సీఎం జగన్ తో భేటీ అయ్యారు. అయితే.. ఒక ఎంపీ టికెట్ తో పాటు, నాలుగు ఎమ్మెల్యే టికెట్లను తాను సూచించిన వారికి ఇవ్వాలని జగన్ ను ఆయన కోరినట్లు తెలుస్తోంది.