Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం!
విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజీవ్ గాంధీ పార్క్ సమీపంలో స్కూల్ బస్ ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మంగళగిరికి చెందిన మునీర్ బాషా, జరీనా గా పోలీసులు గుర్తించారు.
విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజీవ్ గాంధీ పార్క్ సమీపంలో స్కూల్ బస్ ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మంగళగిరికి చెందిన మునీర్ బాషా, జరీనా గా పోలీసులు గుర్తించారు.
విజయవాడ నగర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నగరాన్ని కారుమబ్బులు కమ్మేశాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఏపీ హైకోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. అప్పటి వరకు మాచర్లకు వెళ్లొద్దని ఆయనపై ఆంక్షలు విధించింది న్యాయస్థానం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని ఆదేశాల్లో పేర్కొంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా కదలడంతో శుక్రవారం మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ ఈ రోజు ఉదయం నుంచి వస్తున్న వార్తలపై ఆయన అనుచరులు సీరియస్ అయ్యారు. గుడివాడలోని ఇంట్లోనే ఉన్నారని వారు తెలిపారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.
బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన మూలాలు బెజవాడలో బయటపడ్డాయి. ప్రధాన నిందితుడు లంకపల్లి వాసుది విజయవాడ అని పోలీసులు గుర్తించారు. పూరింట్లో ఉంటూ తల్లితో దోసెలమ్మిన వాసు.. బుకీగా మారి కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు.
పాల్వాయి పోలింగ్ స్టేషన్ లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వసం చేసిన విజువల్స్ ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదన్నారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. దర్యాప్తు సమయంలో ఎక్కడో, ఎవరి చేతి నుంచో ఆ వీడియో బయటకు వెళ్లిందన్నారు. ఈ రోజు మీడియాతో చిట్ చాట్ చేశారు.
అంతరిక్షంలోకి వెళ్లిన సమయంలో గోపిచంద్ తన దేశం మీద భక్తిని చాటుకున్నారు. బ్లూ ఆరిజిన్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో గోపిచంద్ చిన్న భారత జెండాను చూపిస్తున్నారు.
ఏపీలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి జరగనున్నట్లు విద్యాశాఖ కమిషనర్ సురేశ్ తెలిపారు. మంగళవారం అన్ని జిల్లాల విద్యాశాధికారులతో ఆయన వర్చువల్‌గా జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లోనే పరీక్షల తేదీ, షెడ్యూల్‌ను తెలిపారు.