విజయవాడలో వింత వ్యాధి.. సోకితే కాలు తీసేస్తారు.. జాగ్రత్త!

వరదల తగ్గడంతో కాస్త కుదురుకుంటున్న విజయవాడ వాసులను కొత్త వ్యాధి కలవర పెడుతోంది. ఫ్లెష్‌ ఈటింగ్‌ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకి ఇప్పటికే ఓ బాలుడి కాలు తొలగించారు. వరద నీరులో తిరగడం కారణంగానే ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లు తేల్చారు వైద్యులు.

New Update

అతని పేరు భవదీప్.. వయసు 12.. మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు అతని ఇంట్లోకి కూడా భారీగా నీరు వచ్చి చేరింది. ఇంట్లో అమ్మా-నాన్నకు సపోర్ట్ ఇస్తూ ఆ వరద నీటిలోనే ఉన్నాడు. అయితే కొన్ని రోజులు గడిచే సరికే అతని జీవితం ఛీద్రమైంది. అతని కాలు తీసేశారు. ఎలాంటి గాయాలు లేకుండా అతని కాలు ఎందుకు తీశారో చాలా మందికి అర్థంకాలేదు. అయితే డాక్టర్లు చెప్పిన మేటర్ విన్నాక అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. శరీరంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ప్రవేశించడంతో అతని కాలు పనికిరాకుండా పోయింది. ఈ వ్యాధిని నెక్రోటైజింగ్‌ ఫాసియైటిస్‌ అని పిలుస్తారు. దీనికి మరో పేరు ఫ్లెష్‌ ఈటింగ్‌ డిసీజ్‌. అంటే మనిషి మాంసాన్ని తీనే బ్యాక్టిరియా!

తరచుగా వెచ్చని సముద్రపు నీటిలో కనిపించే ఈ బాక్టీరియ తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. ముఖ్యంగా కాలేయ వ్యాధి ఉన్నవారికి ఇది సోకుతుంది. ఈ బ్యాట్టిరియా ప్రభావిత ప్రాంతంలో తీవ్రమైన నొప్పి, వాపు కనిపిస్తుంది. ఎరుపు లేదా ఊదా రంగు చర్మంలా ఆ ప్రాంతం కనిపిస్తుంది. జ్వరం, చలి ఉంటుంది. ఈ బ్యాక్టిరియా శరీరంలో వేగంగా వ్యాపిస్తుంది. అయితే కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలు కనిపించవు. బాధిత వ్యక్తిలోని శరీర కండను సూక్ష్మక్రిములు తినేస్తాయి. మురుగు నీటిలో ఎక్కువగా తిరిగితే ఈ వ్యాధి బారిన పడే ప్రమాదముంటుంది. విజయవాడ భవదీప్‌కు సరిగ్గా జరిగింది ఇదే!

లక్ష మందిలో 0.8 కేసులే

అయితే ఈ తరహా కేసులు నమోదవడం చాలా అరుదు. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి ప్రతీ లక్ష మందిలో కేవలం 0.8 కేసులే రికార్డువుతున్నాయి. అంటే లక్ష మందికి ఒక్క కేసు రికార్డు కాలేదని అర్థం. ప్రకృతి వైపరీత్యాల తర్వాత ఈ ఘటనలు ఎక్కువగా సంభవిస్తాయి. అయితే ఈ ఏడాది జపాన్‌లో మాత్రం ఈ బ్యాక్టిరియా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. 2024 జూన్ 2 నాటికి ఈ కేసులు 977కి చేరుకున్నాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రకారం, ఈ సంఖ్య  గతేడాది జపాన్‌లో నమోదైన మొత్తం 941 కేసులను అధిగమించింది.

ఈ బ్యాక్టీరియాను గుర్తించడానికి అవయవ పనితీరు ఎలా ఉందో డాక్టర్లు చూస్తారు. దీని కోసం అనుమానితుడికి రక్త పరీక్షలు చేస్తారు. ఒకవేళ బాధితుడి శరీరంలో ఈ బ్యాక్టిరియా ప్రవేశించినట్టు తేలితే చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా బ్యాక్టీరియాను చంపడానికి యాంటీబయాటిక్స్‌ ఇస్తారు. ఈ వ్యాధిని నివారించడం అన్నిటికంటే ఉత్తమం. మురుగు నీరు లేదా వరద నీటిలో ఎక్కువ సేపు ఉండే వ్యక్తులు ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో జీవించే వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి. పరిశుభ్రతను పాటించాలి.

ఈ బ్యాక్టిరియా శరీరంలోని ఒక భాగం నుంచి మరొక భాగానికి సోకకుండా వ్యాపించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధి తీవ్రమైతే సంబంధిత అవయవ భాగాన్ని కట్ చేస్తారు. నిజానికి ఈ క్రిముల్లో ప్రమాదకర రకాలు ఉంటాయి. అవి చాలా డేంజర్

#vijayawada-floods
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe