/rtv/media/media_files/2025/09/18/vijayawada-school-boy-incident-2025-09-18-13-32-53.jpg)
Vijayawada school boy incident
AP NEWS: చదువుకోమని మందలించినందుకు తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ బుడ్డోడు! ఈ ఆసక్తికర ఘటన విజయవాడలోని సత్యనారాయణపురంలో జరిగింది. గులాబీతోట ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరి పిల్లలతో ఒంటరి జీవితం సాగిస్తోంది. తన కష్టాన్ని నమ్ముకొని చిన్న కుమారుడిని ఆరో తరగతి చదివిస్తోంది. ఆమె ఓ దుకాణంలో పనిచేస్తూ వచ్చిన డబ్బులతో కుమారుడిని చదివిస్తోంది. పెద్ద కుమారుడు కూడా మరో దుకాణంలో పనిచేస్తున్నాడు. కష్టంగా ఉన్నప్పటికీ చిన్న కుమారుడి క్లాసులు, చదువుకు అవసరంగా ఉంటుందని ఒక మొబైల్ ఫోన్ కొనిచ్చింది. అయితే ఆ బాలుడు మాత్రం సరిగా చదవకుండా నిరంతరం ఫోన్ తో ఆదుకోవడం మొదలు పెట్టాడు. దీంతో తల్లి చదువుకోవడంలేదని మందలించగా.. కోపంతో ఇంటి నుంచి పారిపోయాడు బాలుడు.
తల్లిపై ఫిర్యాదు.
ఇంటి నుంచి పారిపోయిన ఆ బాలుడు విజయవాడలోని వన్‌టౌన్ ఏసీపీ దుర్గారావును ఆశ్రయించాడు. ''మా అమ్మ చదువుకోమని మందలిస్తుంది'' అంటూ తల్లిపై ఫిర్యాదు చేశాడు. కథ మొత్తం విన్న ఏసీపీ, బాలుడి తల్లిని పిలిపించి అసలు విషయాన్ని తెలుసుకున్నారు. చదువుకోకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను గురించి వివరించారు. అలాగే తల్లి కష్టం విలువను బాలుడికి ప్రేమగా అర్థమయ్యేలా చెప్పారు. ఏసీపీ మాటలకు మనసు మార్చుకున్న బాలుడు తన తప్పు తెలుసుకుని, తల్లితో కలిసి ఇంటికి వెళ్ళాడు.
పిల్లల పై ఫోన్ల ప్రభావం
ఇదిలా ఉంటే ప్రస్తుత జనరేషన్ లో పిల్లలకు ఫోన్లు అలవాటు చాలా ప్రమాదకరం! కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు మారాం చేస్తున్నారని వెంటనే చేతికి ఫోన్ ఇచ్చేస్తారు. ఆ కాసేపు ఫోన్ చూసి ఏడుపు మానేస్తారని పేరెంట్స్ అనుకుంటారు కానీ, వాళ్లు మాత్రం ఆ ఫోన్ కి అలవాటు పడిపోతారు. ఫోన్ లేకపోతే అన్నం కూడా తినమని మారాం చేస్తుంటారు కొందరు పిల్లలు. ఇలా పిల్లల దృష్టి మొబైల్ ఫోన్ల పైకి వెళ్లడం ద్వారా వారి ఏకగ్రత, చదువు అన్నీ క్రమంగా తగ్గుతాయి. అంతేకాదు పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కావున తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు ఇవ్వడానికి బదులుగా.. వారితో టైమ్ స్పెండ్ చేయండి, బయటకు తీసుకెళ్లండి, ఏదైనా ఎంగేజింగ్ యాక్టివిటీ వాళ్లకు అప్పగించండి. ఇలా చేయడం ద్వారా పిల్లలు సోషలైజ్ అవ్వడంతో పాటు వారి తెలివితేటలు కూడా పెరిగుతాయి. వారితో టైం స్పెండ్ చేస్తూ మాట్లాడడం ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మెరుగుపడతాయి.