AP: ఆంధ్రా వైపు ఐప్యాక్ అడుగులు.. వైసీపీ మళ్ళీ దోస్తీ..

ఆంధ్రాలో వైసీపీ పార్టీకి,ఐప్యాక్ కన్సెల్టెన్సీకి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే.2024 వైసీపీ ఓటమి తర్వాత మాయమైన ఐప్యాక్ ఇప్పుడు మళ్ళీ ఏపీలోకి అడుగుపెడుతోందని తెలుస్తోంది.2029 ఎన్నికల కోసం జగన్ ఐప్యాక్‌ను మళ్ళీ రంగంలోకి దించుతున్నారని వార్తలు వస్తున్నాయి.

author-image
By Manogna alamuru
ap
New Update

I-PAC Coming Back: 

2019 ఎన్నికల్లో యావత్ దేశమే ఊహించని రీతిలో 151 సీట్లతో అధికారంలోకి రావడానికి.. 2024 ఎన్నికల్లో జగన్ కూడా కల కనని రీతిలో క్రికెట్ టీమ్‌కు పరిమితం కావడానికి కర్త, కర్మ.. క్రియ అన్నీ ఐప్యాక్ వల్లనే అన్నది అందరికీ తెలిసిందే. ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీ నుంచి అవుట్ అయిపోయిన ఐప్యాక్ ఇప్పుడు మళ్ళీ సీన్‌లోకి ఎంటర్ అవుతోంది అని తెలుస్తోంది వైఎస్ జగన్ ఈ సంస్థతో దోస్తీ కట్టనున్నారుట. 2029లో ఎలా అయినా మళ్ళీ గెలిచి అధికార పీఠం చేజిక్కుంచుకోవాలన్న ఆలోచనతోనే ఐప్యాక్‌ను తిరిగి రంగంలోకి జగన్ దించుతున్నట్టు తెలుస్తోంది.

2014 లో మొట్టమొదటిసారిగా..

మొట్టమొదటి సారిగా 2014లో ఆంధ్రాలలోకి ఐప్యాక్ అడుగుపెట్టింది. ఐప్యాక్.. దేశంలోని ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఇది. గతంలో ఈ కన్సెల్టెన్సీ చాలా పార్టీలకు, చాలా రాష్ట్రాల్లో పని చేసింది. ప్రశాంత్ కిషోర్ నేపథ్యంలో ఈ సంస్థ ఆంధ్రా ఎన్నికల మీద ఫోకస్ చేసింది. 2014లో ఓడిపోయి వైఎస్ జగన్...ప్యాక్, ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహాలను, వ్యూహాలను తూచా తప్పకుండా అమలు పరిచారు. దీంతో 2019 ఎన్నికల్లో విజయ దుందుభి మోగించారు. అభ్యర్థుల ఖరారు నుంచి వ్యూహాల వరకు అన్నింటిలోనూ ఐప్యాక్ చెప్పినట్టుగా చేశారు జగన్.  అయితే ఇదే ఐప్యాక్ సలహాలు, వ్యూహాలు 2024 ఎన్నికల్లో బెడిసి కొట్టాయి. ఐప్యాక్ సూచనలతో భారీగా అభ్యర్థుల మార్పు చేశారు. అయినా  ఫలితం దక్కలేదు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు జగన్ ఓడిపోబోతున్నాడని  ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పారు. దీనికి కారణం ఒకరకంగా గతంలో ఐప్యాక్ లో కీలకంగా పని చేసిన ప్రశాంత్ కిషోర్.. తర్వాత ఆ సంస్థకు దూరం అవడం కూడా కావచ్చును. ఇది 2024 ఎన్నికల ఫలితాలమీద బాగా ఎఫెక్ట్ చూపించింది.  151 సీట్లు ఎక్కడ.. 11 స్థానాలు ఎక్కడ..? ఎక్కడ్నుంచి ఎక్కడికి పడిపోయారో చూస్తేనే ఐప్యాక్ వ్యూహ రచన ఎలా ఉందనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వైసీపీ గెలిచినప్పుడు క్రెడిట్ ఐప్యాక్‌కు ఎంత వచ్చిందో తెలియదు కానీ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పుడు మాత్రం అపవాదు మూటగట్టుకుంది. ఐప్యాక్ కారణంగానే వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోయిందనే విమర్శలు వచ్చాయి.


అలాంటిది.. 2029 లో కూడా ఇదే ఐప్యాక్‌తో కలిసి అడుగులు వేయడానికి జగన్ సిద్ధమయ్యారు. పార్టీలో నేతలకు ఇది ఇష్టం లేకపోయినా...ఎవ్వరు ఏమనుకున్నా జగన్ మాత్రం మళ్ళీ ఐప్యాక్‌నే నమ్మకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీనికి కారణం 2024 ఎన్నికల ముందు ఐప్యాక్ డిజైన్ చేసిన క్యాంపెయిన్లు జగన్‌కు నచ్చడమే అని చెబుతున్నారు ముఖ్యంగా.. 'జగనన్నే మా భవిష్యత్తు', 'మా నమ్మకం నువ్వే జగన్', 'జగనన్న సురక్ష', 'జగనన్న ఆరోగ్య సురక్ష' 'వై ఏపీ నీడ్స్ జగన్' 'సిద్ధం', 'మేమంతా సిద్ధం' వంటి క్యాంపెయిన్లు డిజైన్ చేయడంలో ఐప్యాక్ కీలక పాత్ర పోషించిందని...అందుకే జగన్ మళ్ళీ దాన్నే రంగంలోకి దించాలని చూస్తున్నారని అంటున్నారు. 

ప్రస్తుతం ఆంధ్రాలో వైసీపీ పార్టీ చాలా కష్టాలు ఎదుర్కొంటోంది. 2029లో మళ్ళీ ఈ పార్టీ గెలవాలంటే బాగా కసరత్తులు చేయాలి. ప్రజల మధ్యలోకి వెళ్ళాలి క్షేత్రస్థాయి నుంచి అన్నీ బాగు చేసుకుంటూ రావాలి. అందుకే జగన్ ఐప్యాక్ టీమ్ ను దింపుతున్నారని తెలుస్తోంది. తమ పార్టీ క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవడంతో పాటూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై క్యాంపెయిన్లు రన్ చేయాలంటే పొలిటికల్ కన్సల్టెన్సీ సపోర్ట్ కావాలని జగన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రాలో ఐప్యాక్ ఉన్నా వైసీపీ ఓడపోయింది. కానీ వెస్ట్ బెంగాల్‌లో టీఎంసీ మాత్రం ఇదే కన్సెల్టెన్సీతో విజయం సాధించడమే కాకుండా, ఎక్కువ సీట్లను కూడా గెలుచుకుంది. అందుకే ఇప్పుడు జగన్ మళ్ళీ ఐప్యాక్ మీద ఆధారపడడానికి మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. 

అసలేంటీ కన్సెల్టెన్సీలు..

ఇప్పుడు రాజకీయాలు ఈ కన్సెల్టెన్సీలు చుట్టూతానే తిరుగుతున్నాయి. ఎన్నికలంటే పార్టీ మధ్య పూరులా కాకుండా కన్సెల్టెన్సీల మధ్య పోటీలా తయారయింది అంటే అతిశయోక్తి ఏమీ కాదు. ఇందులో రాజకీయాల మీద బాగా స్టడీ చేసినవారు ఉంటారు. వారు పార్టీల గురించి, వారికి ఆయా రాష్ట్రాల్లో ఉన్న లోటుపాట్లు, ప్లస్ పాయింట్లు లాంటివి స్టడీ చేసి చెబుతుంటారు. ఎక్కడ ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తుంటారు. ఎన్నికల టైమ్‌లో ఒక రకంగా పార్టీనే వారే నడిపిస్తుంటారు. ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడాలి, కోట్స్, వ్యూహాలు అన్నీ తామే రచించి ఇస్తారు. ఇది రాజకీయ నాయకులకు బాగా ఉపయోగడుతోంది. చాలాసార్లు కన్సెల్టెన్సీల స్టడీ వల్లనే చాలా చోట్ల చాలా పార్టీలు గెలుస్తున్నాయి కూడా. ఐప్యాక్, షో టైమ్ ఇవన్నీ ఇలాంటి కన్సెల్టెన్సెలే. ఐప్యాక్ అనేది ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ నెలకొల్పారు. ప్రధాని నరేంద్రమోడీ కూడా ఒకప్పుడు దీనిని ఉపయోగించుకున్నారు. ఐప్యాక్‌లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 500పైగా మంది పనిచేస్తున్నట్టుగా సమాచారం. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఐప్యాక్ టీమ్ అంచనా వేస్తుంది. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులతో ఈ టీమ్ ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంది. రాజకీయ పార్టీ విజయానికి కారణమయ్యే అనేక అంశాలు ఉన్నప్పటికీ, కన్సల్టెన్సీ సంస్థలు ఈ కాలంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సర్వేలు, డేటా క్రంచింగ్, ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఇతర పనుల్లో సహాయం చేయడానికి కన్సల్టెన్సీలు ఉపయోగపడుతున్నాయి. ప్రజల్లోకి దూసుకెళ్లేలా పంచ్ ఉండేలా కొటేషన్స్ కూడా నేతల నోటితో పలికిస్తాయి ఈ సంస్థలు.

Also Read: 

ఇప్పుడు మళ్ళీ...

2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైఎస్ జగన్.. ఇప్పుడు మళ్లీ ప్రశాంత్ కిషోర్ పాత టీంతోనే పని చేయాలనుకుంటున్నారు. ఎన్నికల తర్వాత ఐప్యాక్ తో  ఒప్పందం ముగిసింది. దీంతో ఇప్పటి వరకు పార్టీకి ఇది దూరంగా ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ సంస్థతో జగన్ ఒప్పందం చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 
2014-19 వరకు సక్సెస్ అయిన వ్యూహాలను మళ్లీ అమలు చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. గతంలో నవరత్నాలను కూడా ఐప్యాకే డిజైన్ చేసింది. 2019 విజయంలో నవరత్నాల స్కీమ్స్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఈ సారి కూడా మళ్లీ అలాంటీ స్కీమ్స్ తీసుకువచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. దాంతో పాటూ కూటమి ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా వ్యూహాలు రచించనుంది ఐఫ్యాక్. అలాగే వైసీపీ పార్టీలో అభ్యర్ధులను కూడా ఈ కన్సెల్టీనే నిర్ణయిస్తుందని చెబుతున్నారు. 

Also Read: Gold Price: భారీగా తగ్గిన బంగారం ధరలు..ఇంతలా తగ్గడం ఇదే మొదటిసారి

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe