CM Chandra Babu: ఏపీలో వరదల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా పని చేసతున్నారు. మొన్నటివరకు విజయవాడలోనే ఉండి అక్కడ వరద బాధలను తొలగించేందుకు పని చేసిన ఆయన ఇప్పుడు మొత్తం ఏపీలో వరద నష్టం మీద సమీక్ష నిర్వహించారు. మంత్రులు, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్యూమరేషన్ ఎంత మేర జరిగిందన్న అంశంపై సీఎం ఆరా తీశారు. అయితే ఈ వివరాలను అధికారులు సరిగ్గా ఇవ్వలేకపోయారు. దీంతో వారి మీద చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు ఇబ్బందుల్లో ఉంటే మీకు పట్టడం లేదా అంటూ మండిపడ్డారు. ఎన్యూమరేషన్ ఇవ్వడంలో ఎందుకు జాప్యం జరుగుతోంది అంటూ ప్రశ్నించారు. వరద నష్టం అంచనా ఇంత ఆలస్యం అయితే పరిహారం ఎప్పటికి ఇవ్వగలము అంటూ అధికారులను బాబు నిలదీశారు. ఎన్యూమరేషన్ పూర్తైతేనే వరద నష్టం వివరాలు కేంద్రానికి ఇవ్వగలమనే విషయాన్ని గుర్తుంచుకుని పని చేయాలని అధికారులకు సీఎం సూచించారు. రేపటిలోగా ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
Also Read: ఇందిరాగాంధీ పక్కన నిలబడి,ఆమె రాజీనామాకే డిమాండ్..వైరల్ పిక్ చెబుతున్న కథ