AP: సుదీర్ఘ విచారణ తర్వాత విజయపాల్ అరెస్ట్..

డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు కృష్ణంరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో నిందితుడుగా ఉన్న అడిషనల్ డీఎస్పీ విజయపాల్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. సుదీర్ఘ విచారణ తర్వాత పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. 

New Update
ap

గత వైసీపీ హయాంలో రఘురామ కృష్ణంరాజును అక్రమంగా అరెస్టు చేయడంతో పాటు ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో అప్పటి సీఐడీ ఏఎస్పీ విజయపాల్ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఇవాళ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆయనను విచారించారు.  విజయ్‌పాల్‌ మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి విచారించిన పోలీసులు రాత్రి 9గంటల సమయంలో విజయ్‌ పాల్‌ను అరెస్టు చేశారు. రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్‌ హింస కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ విజయ్‌పాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తరువాత సుదీర్ఘ విచారణ తర్వాత అరెస్టు చేసినట్టు ఎస్పీ దామోదర్‌ అధికారికంగా ప్రకటించారు. విజయ్‌పాల్‌ రిమాండ్‌ రిపోర్టును సైతం పోలీసులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆయన్ను ఇవాళ రాత్రి ఒంగోలు తాలూకా పీఎస్‌లో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం గుంటూరుకు తరలిస్తారు. 

అసలేం జరిగింది?

2021లో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌పై రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని రఘురామ నివాసం నుంచి ఆయన్ను బలవంతంగా గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. ఆ రోజు రాత్రి కస్టడీలో తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడ్డారని రఘురామ ఈ ఏడాది జూలై 11న గుంటూరు నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Also Read: Chhattisgarh: 17 ఏళ్ళ బాలికపై అత్యాచారం..నలుగురు ఉపాధ్యాయులు అరెస్ట్

Advertisment
తాజా కథనాలు