Andhra Pradesh: బుడమేరు కట్ట తెగలేదు– మంత్రి పొంగూరు నారాయణ

నగరంలో పలు ప్రాంతాల్లోకి మళ్ళీ బుడ మేరు వరద వస్తుందనేది కేవలం పుకార్లు మాత్రమేనని చెప్పారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ. దాని మీద వస్తున్న వార్తలను ఆయన కొట్టిపడేశారు. ప్రజలు ఆందోళన చెందవద్దని..విజయవాడ పూర్తిగా సేఫ్‌గా ఉందని అన్నారు.

narayana tdp minister
New Update

Minister Narayana: వియవాడలోని న్యూ ఆర్.ఆర్.పేట,జక్కంపూడి కాలనీ తో పాటు పలు ప్రాంతాల్లోకి వరద వస్తుందని కొద్ది సేపటి క్రితం నుంచి బాగా ప్రచారం జరుగుతోంది. బుడమేరు మ్ళీ పొంగుతుందని వార్తలు వచ్చాయి. దీని మీద మమున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పందించారు. ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని..బుడమేరు కట్ట తేగే ఛాన్స లేదని ఆయన హామీ ఇచ్చారు. VMC కమిషనర్ ధ్యాన చంద్ర,ENC గోపాల కృష్ణా రెడ్డి తో ఫోన్ లో మాట్లాడి తాను పూర్తి సమాచారం తెలుసుకున్నానని మంత్రి నారాయణ చెప్పారు. బుడ మేరు కట్ట మళ్ళీ తెగింది అనేది పూర్తిగా అవాస్తవం.ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దు..విజయవాడ పూర్తిగా సేఫ్ గా ఉంది అంటూ మంత్రి భరోసా ఇచ్చారు. 

మరోవైపు బుడమేరు కట్ట తెగినట్టు, పుకార్లు సృష్టించి, ప్రజలని గందరగోళానికి గురి చేస్తోంది సైకో బ్యాచ్. వీరిని అదుపులోకి తీసుకోవడమే కాక బుడమేరు కట్ట తెగినట్టు పుకార్లు నమ్మొద్దు అంటూ, ప్రజల్లో ధైర్యం నింపుతున్నారు పోలీసులు, కలెక్టర్ కార్యాలయం అధికారులు.

#minister-narayana #budameru
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe