Tirumala : టీటీడీ కీలక నిర్ణయం.. త్వరలో ఆ షాపులు క్లోజ్!

టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బోర్డు తీర్మానాలను ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు వెల్లడించారు. టీటీడీ శాశ్వత ఉద్యోగులకు మూడు నెలలకు ఒకసారి సుపథం దర్శనం కల్పిస్తామని, తిరుమలలో లైసెన్స్‌ లేని షాపులను క్లోజ్ చేస్తామని తెలిపారు.  

New Update
br naidu ttd

టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బోర్డు తీర్మానాలను ఈవో శ్యామలరావుతో కలిసి  ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు వెల్లడించారు. టీటీడీ శాశ్వత ఉద్యోగులకు మూడు నెలలకు ఒకసారి సుపథం దర్శనం కల్పిస్తామని, తిరుమలలో లైసెన్స్‌ లేని షాపులను క్లోజ్ చేస్తామని తెలిపారు.  

బోర్డు చేసిన తీర్మానాలు ఇవే!  

టీటీడీలో విధులు నిర్వహిస్తున్న హిందూయేతర ఉద్యోగుల తొలగింపు
రూ.5258.68 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం
రూ.772 కోట్లతో గదుల ఆధునికీకరణ
రాష్ట్రాల రాజధానుల్లో ఆలయాలు నిర్మించాలని నిర్ణయం
ఇతరదేశాల్లోనూ శ్రీవారి ఆలయాలు నిర్మించాలని నిర్ణయం
త్వరలో వీఐపీ బ్రేక్‌ దర్శన వేళల్లో మార్పులు
శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కమిటీ
సైన్స్‌ సిటీకి కేటాయించిన 20ఎకరాలు తిరిగి స్వాధీనం
తిరుమలలో అనధికార హాకర్లపై చర్యలకు నిర్ణయం
ఆగమ సలహా మండలిపై టీటీడీ వేటు
రూ.26 కోట్లతో 1,500 గదులకు మరమ్మతులు
ముంతాజ్‌ హోటల్‌ అనుమతులు రద్దు
వృద్ధులు, దివ్యాంగులకు ఆఫ్‌లైన్‌లో దర్శన టికెట్లు కేటాయింపు
 ప్రయోగాత్మకంగా పూర్వ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం

Advertisment