లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమలకు వైఎస్‌ జగన్‌

తిరుపతి లడ్డూ వ్యవహారం ఆంధ్రాలో రచ్చ రచ్చ అవుతోంది. రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది.  ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ ఈ నెల 28న తిరుపతి వెళ్ళనున్నారు. అదే రోజు రాష్ట్ర ఆలయాల్లో పూజలు చేయాలని జగన్ పిలుపు నిచ్చారు. 

author-image
By Manogna alamuru
New Update
ycp

YS Jagan: 

తిరుపతి పవిత్రతను వైసీపీ దెబ్బ తీసిందని కూటమి ఆరోపణలు చేస్తోంది. లడ్డూలో జంతు కొవ్వు కలిపారని విరుచకుపడింది. కోర్టులు, కేసులు అంటూ హంగామా చేస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ పాప ప్రక్షాళన అంటూ దీక్షకూడా చేపట్టారు. ఇప్పుడు ఈ విషయం కేంద్రం దాకా కూడా పాకిపోయింది. నేషనల్ ఇష్యూగా మారింది. కల్తీ నెయ్యి వాడారంటూ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ కూటమి నేతలు ఓ వైపు ఆరోపిస్తున్నారు. మరోవైపు వైసీపీ మాత్రం.. తమ హయాంలో ఎలాంటి తప్పూ జరగలేదని చెప్తోంది. టీటీడీ ముందు నుంచి అనుసరిస్తున్న నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్షల విధానాన్ని కొనసాగించినట్లు చెప్తోంది. ఈ పరిస్థితిని వైసీపీ ధీటుగా ఎదుర్కొనేందుకు రెడీ అవుతోంది. 

ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28న ఆయన తిరుపతి వెళ్ళనున్నారు. కాలి నడకను తిరుమల చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటానని జగన్ అనౌన్స్ చేశారు. దాంతో పాటూ అదే రోజు ఆంధ్రాలో ఉన్న దేవాలయాలన్నింటిలో పూజలు జరపాలని జగన్ పిలుపునిచ్చారు.  తిరుమల పవిత్రతను ప్రస్తుత ప్రభుత్వం దెబ్బతీసిందని...చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు తాను తిరుమల వెళుతున్నానని జగన్ చెప్పారు.

Also Read: 11 రూ. లకే ఐఫోన్ 13 కేవలం ముగ్గురికే ..ఫ్లిప్ కార్ట్ ఏం చెప్పింది?

Advertisment
Advertisment
తాజా కథనాలు