బ్లాక్‌లో టీటీడీ వీఐపీ దర్శన టికెట్లు.. ఎమ్మెల్సీపై కేసు నమోదు!

AP: వైసీపీ మాజీ ఎమ్మెల్సీ జకియా ఖానంపై తిరుమల పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. శ్రీవారి దర్శన టికెట్లలో మోసం చేశారని బెంగళూరుకు చెందిన భక్తుడు ఆమెపై ఫిర్యాదు చేశారు. ఆరు వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లకు రూ.65 వేలు వసూలు చేశారని అందులో పేర్కొన్నారు.

 Zakia Khanam
New Update

YCP EX MLC: వైసీపీ మాజీ ఎమ్మెల్సీ జకియా ఖానంపై కేసు నమోదు అయింది. శ్రీవారి దర్శన టికెట్లలో మోసం చేశారని బెంగళూరుకు చెందిన భక్తుడు ఆమెపై తిరుమల రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆరు వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లకు రూ.65 వేలు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బెంగళూరు భక్తులను జకియా ఖానం తన లేఖ ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఎమ్మెల్సీతో పాటు ఆమె పీఆర్వో కృష్ణతేజ, చంద్రశేఖర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇటీవల ఆమె వైసీపీకి రాజీనామా చేసిన టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: ఢిల్లీలోని పాఠశాల వద్ద పేలుడు!

వైసీపీ నేతల పనే...

తనపై నమోదు అయిన కేసు పై  ఎమ్మెల్సీ జకియా ఖానం స్పందించారు. తాను టీడీపీలో చేరుతున్నానని తెలుసుకొని కొందరు వైసీపీ నేతలు.. తనపై కావాలనే ఇలాంటి కుట్ర పన్నారని ఆమె ఆరోపించారు. కావాలనే కొందరు తన లెటర్ ప్యాడ్ ను దుర్వినియోగం చేశారని అన్నారు. అసలు డబ్బులకు తన లెటర్‌ను ఇచ్చిన విషయం కూడా తనకు తెలియదని చెప్పారు. పోలీసులు సమాచారం ఇవ్వడం వల్లే తనకు ఈ విషయం తెలిసిందని చెప్పారు. కొందరు వైసీపీ నేతలు తనపై పని పెట్టుకుని ఇందుకు అక్రమంగా ఇరికించారని ఫైర్ అయ్యారు. నిజాయితీగా ఉండేవారికి వైసీపీలో గౌరవం లేదని మండిపడ్డారు. మైనార్టీ మహిళలకు వైసీపీలో గౌరవం లేదని అన్నారు. 

ఇది కూడా చదవండి:  ఐదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు గ్యాంగ్ రేప్!

మా ఎమ్మెల్సీ కాదు: వైసీపీ

జకియా ఖానం వైసీపీ ఎమ్మెల్సీ అంటూ వస్తున్న వార్తలపై వైసీపీ స్పందించింది. ట్విట్టర్ ;లో.. "రాష్ట్రంలోని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను డబ్బుతో కొనుక్కున్నది టీడీపీ. వాళ్ళంతా టీడీపీలో చేరుతున్నట్లు రాసేది మీ ఎల్లోమీడియా. ఇప్పుడు వాళ్ళు టీటీడీ లెటర్లు అమ్ముకోగానే వాళ్ళు వైసీపీ ఎమ్మెల్సీ అని మాట మార్చి ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్సీ జకియా ఖానం ఇప్పుడు వైయ‌స్ఆర్ సీపీలో లేరు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం జకియా ఖానం టీడీపీలోకి వెళ్లిపోయారు. తిరుమలలో బ్లాక్ లో వీఐపీ టికెట్లు అమ్ముకుంటున్నట్లు వస్తున్న వార్తలతో వైయస్ఆర్ సీపీకి ఎలాంటి సంబంధం లేదు. మంచి జరిగితే మన ఖాతాలో చెడు జరిగితే పక్కనోళ్ల ఖాతాలో వేయడం చంద్రబాబు, ఆయన చెంచా మీడియాకి వెన్నతో పెట్టిన విద్య." అని పోస్ట్ చేసింది.

ఇది కూడా చదవండి:తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్

ఇది కూడా చదవండి: అమరావతి పనులను తిరిగి ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe