Kashibugga : తొక్కిసలాటకు కారణం ఇదే.. కన్నీరు పెట్టిస్తోన్న వీడియోలు!

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో నవంబర్‌ 1వ తేదీన(ఇవాళ) ఘోర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి 10 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ఘటనలో గాయపడ్డ మహిళలు, పిల్లలు రోదిస్తున్న తీరు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.

New Update
FotoJet - 2025-11-01T134622.339

Srikakulam Venkateswara Swamy Temple Stampede

Kashibugga : ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో నవంబర్‌ 1వ తేదీన(ఇవాళ) ఘోర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి 10 మంది మరణించారు(మృతుల సంఖ్య పెరగొచ్చని చెబుతున్నారు). ఏకాదశి కావడంతో భక్తులు భారీగా రావడంతో ఇది చోటు చేసుకుంది.  ఉత్తరాంధ్ర చిన్నతిరుపతిగా పేరున్న ఈ ఆలయంలో.. ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయకపోవడమే ఈ విషాదానికి కారణమని తెలుస్తోంది. కాగా తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. వారి ఆర్తనాదాలతో దేవాలయ ప్రాంగణం మరుభూమిగా మారిపోయింది. అక్కడి దృశ్యాలు ప్రతి ఒక్కరిచి కలచివేస్తున్నాయి. మహిళలు, పిల్లలు రోదిస్తున్న తీరు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు