/rtv/media/media_files/2026/02/07/fotojet-10-2026-02-07-21-22-11.jpg)
AP Local Body Elections
Andhra Pradesh Local Body Elections 2026: ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. గ్రామపంచాయితీ ఎన్నికల కోసం ఓటర్ జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. గ్రామ పంచాయతీల సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం, రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన వార్డు వారీ ఫోటో ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల పదవీ కాలం గడువు మరికొన్ని రోజుల్లో ముగియనుంది. దీంతో ఆయా చోట్ల ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు కసరత్తులు ప్రారంభించింది. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితా సిద్దం చేయాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే నెల 9కి ఓటర్ లిస్ట్ రెడీ చేయాలని SEC సూచించింది. అయితే రాష్ట్రంలో జనగణన ఉండటంతో అది పూర్తి అయిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఓటర్ల జాబితాపై ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది.
2026 జనవరి ఒకటిని అర్హత తేదీగా తీసుకుని అసెంబ్లీ ఓటరు జాబితాలను ఆధారంగా చేసుకుని ఈ జాబితాలు తయారు చేయాలని ఆదేశించింది.ఇలా తయారు చేసిన ఓటరు జాబితాలను మార్చి 9న అధికారికంగా ప్రచురించబోతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ దృష్ట్యా ఈ ప్రక్రియ చేపట్టబడుతున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.ఈ లెక్కన మార్చి 9న ఓటరు జాబితాల్ని ప్రచురిస్తే..ఆ తర్వాత ఏ క్షణంలో అయినా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వానికి అవకాశం లభిస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన, జనాభా గణనతో వీటికి ఎలాగో సంబంధం లేదు కాబట్టి ఈ ఏడాదిలోనే ఈ ఎన్నికల నిర్వహించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. దీంతో అధికార పక్షమైన కూటమి ప్రభుత్వంతో పాటు ప్రతపక్ష వైసీపీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేందుకు ఇప్పటి నుంచే వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు.
Follow Us