AP News: ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం రామాపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున రామాపురం బస్ స్టాప్‌కు సమీపంలో తుపాకీ కాల్పుల మోత కలకలం రేపింది. తుపాకుల శబ్దంతో రామాపురం గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాజకీయ పార్టీల మధ్య కక్షల నేపథ్యంలో ఫ్యాక్షన్ కాల్పులుగా బావించిన స్థానికులకు అవి పోలీసు కాల్పులు తెలిసి ఆశ్చర్యపోయారు. అందులోనూ తెలంగాణ పోలీసులు కాల్పులు జరపడం సంచలనంగా మారింది. తెలంగాణలో చోరీలకు పాల్పడిన బీహార్‌కు చెందిన దొంగల ముఠా రామాపురం గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్నారని గుర్తించిన తెలంగాణ పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు.
దొంగలు పరారీ కావడంతో..
కొద్దిసేపు దొంగల ముఠాకు, తెలంగాణ పోలీసులకు మద్య ఎదురెదురు కాల్పులు జరిగాయి. కాల్పులు జరుపుకుంటూ పోలీసులు వెంబడించడంతో దొంగల ముఠా ద్విచక్ర వాహనాల్లో పరారయ్యింది. ఓ చోరీ కేసులో విచారణకు వచ్చిన తెలంగాణ పోలీసులపై దుండగులు దాడికి యత్నించారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. దొంగలు పరారీ కావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు, ధర్మవరం సబ్ డివిజన్‌లో ఉన్న సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది హుటాహుటిన రామాపురం గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఇది కూడా చదవండి: కాయిల్స్‌తో ఇలా చేస్తే దోమలు కాదు మనం పోవడం గ్యారంటీ
ఇది కూడా చదవండి: నడుంనొప్పి కంటిన్యూగా వస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు
ఇది కూడా చదవండి: కార్డియాక్ డిప్రెషన్ అంటే ఏంటి?
ఇది కూడా చదవండి: ఫ్యాట్ మొత్తం కరిగించే అద్భుతమైన పండ్లు ఇవే