/rtv/media/media_files/2025/08/14/zptc-2025-08-14-11-01-43.jpg)
మాజీ సీఎం వైఎస్ జగన్ కు బిగ్ షాక్ తగిలింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,735 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 685 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్ కూడా కోల్పోయారు. మరోవైపు ఒంటిమిట్ట కౌంటింగ్ కొనసాగుతుండగా అక్కడ కూడా టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
• 1995, 2001, 2006, 2021 ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక
• వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట కావడంతో నామినేషన్ కు కూడా ధైర్యం చేయలేని ప్రత్యర్థులు
• 2016లో తొలిసారి అక్కడ అభ్యర్థిని నిలిపే ప్రయత్నం చేసిన టీడీపీ
• రమేష్ యాదవ్ ను బరిలోకి దించిన నాటి అధికార పార్టీ
• నామినేషన్ల విత్ డ్రా తర్వాత టీడీపీకి హ్యాండిచ్చి వైసీపీ కండువా కప్పుకున్న రమేష్ యాదవ్
• అయినా.. వదిలి పెట్టని టీడీపీ.. ఆ పార్టీకి 2750 ఓట్లు
• 2500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి లింగమయ్య
• 2021లో పులివెందుల జడ్పీటీసీగా ఎన్నికైన వైసీపీ నేత మహేశ్వర్ రెడ్డి
• 2023, ఫిబ్రవరిలో శివరాత్రి సంబరాల్లో ఎడ్లబండిపై నుంచి పడి మృతి
• దీంతో ఇక్కడ ఉప ఎన్నిక..
• మహేశ్వర్ రెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డిని బరిలో దించిన వైసీపీ..
• ఈసారి ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో తొలి నుంచి పక్కా ప్లాన్ చేసిన టీడీపీ