జగన్ కు షర్మిల రాసిన సంచలన లేఖను బయటపెట్టిన టీడీపీ! టీడీపీ సంచలన పోస్ట్ చేసింది. జగన్ కు షర్మిల రాసిన లేఖలను బయటపెట్టింది. ఆస్తిలో తన నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ కు సమాన వాటా ఉంటుందని తండ్రి రాజశేఖర్ రెడ్డి గతంలో చెప్పిన మాటకు ఒప్పుకున్న జగన్.. ఇప్పుడు మోసం చేశాడని ఆ లేటర్లో షర్మిల ఆరోపించింది. By Nikhil 23 Oct 2024 | నవీకరించబడింది పై 23 Oct 2024 20:32 IST in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి టీడీపీ సంచలన పోస్ట్ చేసింది. జగన్ కు షర్మిల రాసిన లేఖలను బయటపెట్టింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు సంచలన విషయాన్ని బయటపెడతామని ఈ రోజు పోస్ట్ చేసిన టీడీపీ.. కానీ చెప్పిన సమయానికి కన్నా ముందే బయటపెట్టింది. ''మీరు ఇటీవల నాకు పంపిన లేఖపై నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ వనరుల ద్వారా సంపాధించిన ఆస్తులన్నింటినీ తన నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ కు సమానంగా పంచాలని ఆదేశించిన విషయం నేను మీకు గుర్తు చేస్తున్నాను. మీరు ఆ షరతుకు అంగీకరిస్తున్నాని ఆ సమయంలో మాకు హామీ కూడా ఇచ్చారు. కానీ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మీరు ఆ షరతుకి నేను ఒప్పుకోను అంటూ నిరాకరించారు. భారతీ సిమెంట్స్, సాక్షి ఇలా తన జీవితకాలంలో నాన్న సంపాదించిన ఆస్తులన్నీ తన నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ సమానంగా పంచుకోవాలని ఆనాడే నిర్ద్వంద్వంగా చెప్పారు. వీటన్నిటికీ మన అమ్మ సాక్షి మాత్రమే కాదు మన మధ్య జరిగిన పరస్పర ఒప్పందాలన్నీ గమనించింది కూడా.. '' అంటూ ఈ ఏడాది సెప్టెంబర్ 12న షర్మిల జగన్ కు రాసిన లేఖను టీడీపీ తన అధికారిక X ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ లేఖపై వైఎస్ విజయమ్మ కూడా సంతకం చేసినట్లు కనిపిస్తోంది. Also Read: వైసీపీ ఫ్యామిలీలో ముదిరిన వివాదం.. షర్మిల, విజయమ్మపై జగన్ పిటీషన్ చరిత్రలో ఏ పురాణం చూసినా, ఈ ప్రపంచంలో ఏ జీవిని చూసినా, తల్లి తరువాతే ఏదైనా. జంతువులకు కూడా తల్లి అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఈ కన్నీటి లేఖ చూస్తే, జంతువుల కంటే ఘోరంగా ప్రవర్తించే ఒక వింత సైకో గురించి తెలుసుకుంటారు. ఇంటి ఆడ బిడ్డకు ఆస్తి ఇవ్వకుండా, జగన్… pic.twitter.com/2HxphVWh4s — Telugu Desam Party (@JaiTDP) October 23, 2024 సైకో జగన్, శాడిస్ట్ రూపం గురించి లేఖ రాసిన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ"ప్రేమ, ఆప్యాయతలతో నాకు బదిలీ చేసినట్లు చేసుకున్న అవగాహన ఒప్పందం, (MOU)లో పేర్కొన్న ఆస్తులు, ఇవన్నీ మన తండ్రి ఆదేశాలను పాక్షికంగా నెరవేర్చడం కోసం మాత్రమే. నేను పాక్షికంగా అని చెప్పడానికి కారణం సాక్షి… pic.twitter.com/Hv4IBcVhAe — Telugu Desam Party (@JaiTDP) October 23, 2024 జగన్ రెడ్డికి ఆవేదనతో లేఖ రాసిన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ"మీరు ఇప్పుడు సొంత తల్లి మీద కూడా కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఎమ్ఓయు ప్రకారం మీ సొంత చెల్లికి చెందాల్సిన ఆస్తులు కూడా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. మన తండ్రి అడుగు జాడల్లో నడవాల్సిన మీరు ఈ విదంగా దారి… pic.twitter.com/jl6N0iSsbI — Telugu Desam Party (@JaiTDP) October 23, 2024 Also Read: ఏపీలో మందుబాబులు ఎగిరి గంతేసే వార్త.. రూ.99కే క్వార్టర్ అమ్మకాలు షురూ! జగన్ రెడ్డికి ఎంతటి సైకోనో చెప్తూ లేఖ రాసిన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ"ఇప్పుడు మీరు మన తండ్రి ఆదేశాలకు తూట్లు పొడుస్తూ ఏకపక్షంగా ఎంఓయూని రద్దు చేయాలని కోరుతున్నారు. చట్టపరంగా మీ లేఖ ఎంఓయూకి విరుద్ధం దానికి ఏమాత్రం పవిత్రత లేదు. కానీ మీ లేఖ వెనుక ఉన్న దురుద్దేశం నాకు చాలా బాధ… pic.twitter.com/E9hy6imuyQ — Telugu Desam Party (@JaiTDP) October 23, 2024 జగన్ రెడ్డికి వికృత మనస్తత్వం వివరిస్తూ, లేఖ రాసిన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ"MOU ప్రకారం నా వాటాలో భాగంగా నాకు ఇవ్వబడిన సరస్వతి పవర్‌పై, MOU ఒప్పందంపై సంతకం చేసిన వెంటనే దాని షేర్లన్నింటినీ నాకు బదిలీ చేస్తానని మీరు హామీ ఇచ్చారు. అయితే, మీరు చాలా సంవత్సరాలుగా హామీ… pic.twitter.com/VWek6Lnocm — Telugu Desam Party (@JaiTDP) October 23, 2024 తనకు రావలసిన ఆస్తి వాటాను కోరుతూ వైయస్ షర్మిల జగన్ కు సెప్టెంబర్ 12న రాసిన లేఖ#YSSharmilaLetter #TDP #YSRCP #TDPTrends pic.twitter.com/CMTC5x8jcu — TDP Trends (@Trends4TDP) October 23, 2024 Also Read: APPSC చైర్మన్ ను నియమించిన గవర్నర్.. ఆ ఐపీఎస్ అధికారికి ఛాన్స్! జగన్ ఓ సైకో.. : టీడీపీ జంతువుల కంటే ఘోరంగా ప్రవర్తించే ఒక వింత సైకో జగన్ అని ఈ సందర్భంగా టీడీపీ జగన్ పై సంచలన కామెంట్స్ చేసింది. ఇంటి ఆడ బిడ్డకు ఆస్తి ఇవ్వకుండా, జగన్ రెడ్డి అనే సైకో వేధించాడని ఈ పోస్ట్ లో ఆరోపించింది. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇచ్చిన మాటని ఈ సైకో ఎలా తప్పాడో చూడండి అంటూ ధ్వజమెత్తింది. ఇలాంటి సైకోలు రాజకీయాల్లో, సమాజంలో ఉంటే ఎంత ప్రమాదమో చెప్పడానికే ఈ లేఖని ప్రజల్లో పెడుతున్నామని తెలిపింది. Also Read: ప్రజలకు చంద్రబాబు సర్కార్ దీపావళి గిఫ్ట్.. కేబినెట్ కీలక నిర్ణయాలు! #tdp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి