సిగ్గుంటే నాని, వంశీ, అవినాష్ భయంపై సినిమా తీయి.. RGVకి బుద్దా వెంకన్న సవాల్! రాంగోపాల్ వర్మకు దమ్ముంటే గత ప్రభుత్వ హయాంలో రెచ్చిపోయి ఇప్పుడు దాక్కున్న కొడాలి నాని, వంశీ, అవినాష్ పై సినిమా తీయాలని బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. గతంలో వర్మ పెట్టిన పోస్టులు తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చాయన్నారు. By Nikhil 01 Dec 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి దర్శకుడు రాంగోపాల్ వర్మపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ సహకారంతో వర్మ ఇష్టం వచ్చినట్లు వాగాడన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను కించపరిచేలా సినిమాలు తీశాడన్నారు. తన ట్విట్టర్లో మార్ఫింగ్ పోటోలు పెట్టి పైశాచిక ఆనందం పొందాడని ధ్వజమెత్తాడు. ఇప్పుడు కేసులకు భయపడి అడ్రెస్ లేకుండా దాక్కున్నాడన్నారు. నువ్వు దమ్ముగా ఉంటే.. నిలబడు.. నేను చేసింది కరెక్టు అని చెప్పు అని సవాల్ విసిరారు. వర్మకు నిజంగా సిగ్గుంటే.. ఆనాడు రెచ్చిపోయి.. ఇప్పుడు దాక్కున్న కొడాలి నాని, వంశీ, అవినాష్ గురించి సినిమా తీయాలన్నారు. తల్లి, కూతుళ్లను వదిలేసిన వర్మను వెనుకేసుకొచ్చి మాట్లాడతావా? అంటూ మాజీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. జగన్ కూడా తల్లి, చెల్లిని కూడా బయటకు పంపేశాడన్నారు.ఇది కూడా చదవండి: రాజ్యసభకు మహేశ్ బాబు బావ.. చంద్రబాబు శుభవార్త! మరి వివేకం సినిమాపై గగ్గోలు ఎందుకు? అదే జగన్ వివేకం సినిమా గురించి ఎందుకు గగ్గోలు పెడుతున్నాడని ప్రశ్నించారు. మరి ఆ సినిమా నిర్మాత, దర్శకుడిని ఎందుకు సన్మానించలేదని ప్రశ్నించారు. వ్యూహం సినిమా తీసిన నిర్మాతను టీటీడీ బోర్డు సభ్యుడిని చేస్తావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంకన్న. చంద్రబాబును కించపరిచేందుకే ఇటువంటి చెత్త సినిమాలను వర్మతో జగనే తీయించాడన్నారు. అందుకే ఇప్పుడు వర్మను కాపాడాలని సిగ్గు లేకుండా జగన్ మాట్లాడుతున్నాడన్నారు. జగన్ అసలు బాగోతం తెలిసి వైసీపీని వీడేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోవడం ఖాయమన్నారు.ఇది కూడా చదవండి: సీఎం చేయకపోతే ప్రభుత్వంలో చేరను.. షిండే సంచలన నిర్ణయం! కూటమి పార్టీల వైపు కీలక నేతలు చూస్తున్నారన్నారు. ఇటీవల జగన్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే.. అతని మైండ్ కూడా సరిగా లేదనిపిస్తుందన్నారు. జగన్ ఆదేశాలతోనే.. వారి సోషల్ మీడియాలో నీచమైన పోస్టులు పెట్టారన్నారు. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా వదలకుండా పోస్టులు పెట్టారన్నారు. వర్మ పెట్టిన పోస్టులు కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చాయన్నారు. కల్లు తాగిన కోతిలా వర్మ వాగుతున్నాడని.. జగన్ వంత పాడుతున్నాడన్నారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి