AP: చంద్రబాబు నెల రోజుల పాలనపై పబ్లిక్ రియాక్షన్ - VIDEO
కుటమి సర్కార్ నెల రోజుల పాలనపై శ్రీకాకుళం జిల్లా వాసుల అభిప్రాయాలను RTV సేకరించింది. చంద్రబాబు 30 రోజుల పరిపాలనపై వారు ఏమన్నారో ఈ వీడియోలో చూడండి..
కుటమి సర్కార్ నెల రోజుల పాలనపై శ్రీకాకుళం జిల్లా వాసుల అభిప్రాయాలను RTV సేకరించింది. చంద్రబాబు 30 రోజుల పరిపాలనపై వారు ఏమన్నారో ఈ వీడియోలో చూడండి..
AP: టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో వైసీపీ నేతలకు భారీ ఊరట లభించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వైసీపీ నేతలపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.
AP: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఇసుక చోరి దుమారం రేపుతోంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అక్రమంగా ఇసుక దోపిడీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై దువ్వాడ స్పందిస్తూ.. అచ్చెన్నాయుడు అనుచరులే ఇసుకను కొల్లగొట్టారని అన్నారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
AP: మత్స్య పరిశ్రమ ఉత్పత్తుల ఎగుమతులు వృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. ఎగుమతులకు ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు. మత్స్యకారులందరికీ రాయితీ పథకాలు అమలు చేయాలని చెప్పారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఇసుక డంప్ యార్డులో గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున ఇసుక దందా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో ఓడినా వైసీపీ నేతల కనుసైగల్లో ఇసుక దోపిడీ జరిగిందన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో ఇప్పుడు దందాకు బ్రేక్ పడిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చారు. గత ఐదేళ్లలో చుక్క నీరు కూడా అందని టెక్కలిపట్నం కాలువకు వంశధార నీటిని తీసుకువచ్చారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అక్రమాలకు పాల్పడటమే తప్పా చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు.
పారదర్శకత గురించి మీరు.. జగన్ మాట్లాడితే నవ్విపోతారంటూ వైసీపీ నేత బొత్సకు మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పారదర్శకతకు పాతరేసిందే వైసీపీ పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు. దయచేసి పారదర్శకత.. వాస్తవాలు వంటి పెద్ద పెద్ద పదాలు వాడొద్దంటూ ఆయన పోస్ట్ చేశారు.
శ్రీకాకుళం - ఆమదాలవలస రోడ్డు విస్తరణ పనుల్లో ఏ మాత్రం పురోగతి కనిపించడం లేదని స్థానికులు వాపోతున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి నెల రోజులు గడుస్తున్నా ఇంకా పనులు మొదలు పెట్టకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.