సింహాద్రి అప్పన్న లడ్డూలో నాణ్యత లేదు: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు

విశాఖపట్నం సింహాద్రి అప్పన్న లడ్డూలో నాణ్యతపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేశారు. యూపీకి చెందిన సంస్థ నెయ్యిని తక్కువ రేటుకి సరఫరా చేయడంపై అనుమానం వ్యక్తం చేశారు. శాంపిల్స్ తీసుకుని రిపోర్ట్ ఇవ్వాలని గంటా ఆదేశించారు.

New Update
Ganta Srinivasrao

దేశవ్యాప్తంగా తిరుపతి లడ్డూలో కల్తీ ఉందనే ఆరోపణలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాఖపట్నంలో కొలువైన సింహాద్రి అప్పన్న లడ్డూ నాణ్యతపై భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. లడ్డూ ప్రసాదంలో నాణ్యత విషయంలో అనుమానం వ్యక్తం చేస్తూ.. ఈరోజు అన్న ప్రసాదంలో ఉన్న స్టోర్‌ను పరిశీలించారు. అన్నదానం, లడ్డూ, పులిహోరకి ఉపయోగించే సరుకులను గంటా పరిశీలించారు.

శాంపిల్స్ తీసుకుని రిపోర్ట్ ఇవ్వాలి

ఈ క్రమంలో నెయ్యి నాణ్యతతో పాటు మిగతా సరుకుల నాణ్యత విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆవు నెయ్యి మార్కెట్లో 650 రూపాయలు ఉందని, కానీ ఉత్తరప్రదేశ్‌కి చెందిన సంస్థ 385 రూపాయలకే సరఫరా ఎలా చేస్తుందని గంటా అనుమానం వ్యక్తం చేశారు. ప్రసాదానికి వాడే నెయ్యిలో ఎలాంటి నాణ్యత లేదని గంటా శ్రీనివాస్ రావు అధికారులపై మండిపడ్డారు. వెంటనే ఫుడ్ కార్పొరేషన్ వారు శాంపిల్స్ తీసుకుని, రిపోర్ట్ ఇవ్వాలని గంటా ఆదేశాలు జారీ చేశారు

Advertisment
Advertisment
తాజా కథనాలు