YS Sharmila: లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టుకు షర్మిల... సంచలన లేఖ!

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. జగన్ ప్రభుత్వం లడ్డూలో కల్తీ చేస్తే.. బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తుందని లేఖలో ఆమె పేర్కొన్నారు.

YS Sharmila: నన్ను ఓడించేందుకు కుట్ర.. సీఎం జగన్‌పై షర్మిల విమర్శల దాడి
New Update

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. తిరుమల లడ్డూ వివాదాన్ని సుమోటోగా స్వీకరించి వెంటనే దర్యాప్తు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మత ఘర్షణలకు ఆజ్యం పోసే విధంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయని షర్మిల మండిపడ్డారు. ప్రజలకు కావాల్సింది దీక్షలు, ప్రమాణాలు కాదని.. నిజం కావాలన్నారు. డిక్లరేషన్ విషయంలో అందరికీ ఒకటే నిబంధనలు ఉంటాయన్నారు. జగన్ ప్రభుత్వం లడ్డూలో జంతువుల కొవ్వు కలిపితే.. కూటమి ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తుందని షర్మిల మండిపడ్డారు.

బీజేపీ బాటలోనే పవన్ నడుస్తున్నారు

అసలు రాష్ట్రంలో పాలన జరుగుతుందా? దృష్టి ఎక్కడ ఉంది? సీఎం శాంతి హోమాలు చేస్తుంటే.. డిప్యూటీ సీఎం పవన్ దీక్షలు, జగన్ ప్రక్షాళన పూజలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అందరూ కలిసి నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని, జంతువుల ఆయిల్ కలిపారని రిపోర్ట్‌లు, ఆధారాలు ఉన్నా కూడా వెంటనే చర్యలు తీసుకోకుండా మత రాజకీయాలు చేస్తున్నారని షర్మిల అన్నారు. బీజేపీ బాటలోనే పవన్ నడుస్తున్నారని.. కూటమి ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుందని షర్మిల మండిపడ్డారు. ఇప్పటి వరకు ఏపీలో మత ఘర్షణలు లేవని.. కానీ, లడ్డూ విషయంలో ఈ ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందన్నారు. 

ప్రధాని మోదీ తిరుమలను దర్శించుకున్నప్పుడు.. 120 కోట్ల మంది భారతీయులకు మంచి జరగాలని కోరుకున్నానని అన్నారని గుర్తు చేశారు. కానీ ఇంత వివాదం జరుగుతుంటే సైలెంట్‌గా ఎందుకు ఉన్నారని షర్మిల పశ్నించారు. ఎన్‌డీడీబీ ఇచ్చిన రిపోర్ట్‌తో చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? హిందూమతం మీద కుట్ర జరిగితే దర్యాప్తులో తెలిసేది కదా? అని ప్రశ్నించారు. రెండు నెలలుగా రిపోర్ట్ దగ్గర ఉంచుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇప్పుడు వేసిన సిట్ ముందే ఎందుకు వేయలేదని ఆమె లేఖలో రాశారు. 

ఆధారాలు దగ్గర ఉంచుకుని బాబు, జగన్, పవన్, బీజేపీ అందరూ కలిసి నీచ రాజకీయాలు చేస్తున్నారని, మత పరమైన విద్వేషాలను రెచ్చ గొట్టే విధంగా మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. కల్తీకి పాల్పడిన వారిపై తప్పకుండా చర్యలు చేపట్టాలని.. అసలు కల్తీకి పాల్పడింది ఎవరో మాకు నిజం కావాలని సుప్రీంకోర్టుకు ఆమె లేఖ రాశారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వాలా? వద్దా? అనేది తన ఇష్టమన్నారు. కానీ అందరికీ ఒకే రూల్స్ ఆమె స్పష్టం చేశారు. గత పదేళ్ల నుంచి రాష్ట్రం అభివృద్ధి లేదని, కొత్త పరిశ్రమలు కూడా రావడం లేదని, 20 ఏళ్ల వెనక్కి రాష్ట్రం వెళ్లిపోయిందని షర్మిల లేఖలో తెలిపారు. 

#ap-chief-sharmila
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి