ఏపీలో రాజధాని పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రూ. 8,821 కోట్లతో రాజధానిలో పనులు చేపట్టేందుకు అథారిటీ అనుమతి లభించిందని మంత్రి చెప్పారు. ట్రంక్ రోడ్లు, ఎల్‌పీఎస్ లేఅవుట్ రోడ్లు, మంత్రులు, జడ్జిల బంగ్లాల నిర్మాణం చేపట్టేందుకు వీలుగా అనుమతి లభించిందని అన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 42వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను మంత్రి నారాయణ వివరించారు.
అమరావతిలో ప్రధాన ట్రంక్ రోడ్లను నిర్మాణం చేయనున్నామని...దాని కోసం రూ.4,521 కోట్లను ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు మంత్రి నారాయణ. అలాగే ఎల్‌పీఎస్ లేఅవుట్ల రహదారుల కోసం రూ.3,807 కోట్లకు సీఆర్‌డీఏ అథారిటీ అనుమతి ఇచ్చిందని తెలిపారు. 2014-19తో పోలిస్తే రహదారుల నిర్మాణం కోసం 28 శాతం మేర ధరలు పెరిగాయని మంత్రి చెప్పారు. భవనాల నిర్మాణం కోసం 35 - 55 శాతం మేర ధర పెరిగిందన్నారు. అదనంగా జీఎస్టీ కూడా 6 శాతం మేర పెరిగిందని వివరించారు.
Also Read: Mohan Babu: మనోజ్ నువ్వు నా గుండెల మీద తన్నావ్..మోహన్ బాబు