MONTHA CYCLONE : ఇంట్లో నుంచి బయటకు రావొద్దు.. ఆ జిల్లాల వారికి హై అలర్ట్!

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ మొంథా తుపాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో కదులుతోందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి మచిలీపట్నంకు 230కి.మీ, కాకినాడకి  310కి.మీ విశాఖపట్నంకు  370కి.మీ,దూరంలో కేంద్రీకృతమైంది.

New Update
MONTHA CYCLONE

MONTHA CYCLONE

MONTHA CYCLONE : పశ్చిమమధ్య బంగాళాఖాతంలో  ఏర్పడ్డ మొంథా తుపాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో కదులుతోందని  ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి మచిలీపట్నంకు 230కి.మీ, కాకినాడకి  310కి.మీ విశాఖపట్నంకు  370కి.మీ,దూరంలో కేంద్రీకృతమైనట్లు తెలిపింది. మరికాసేపట్లో తీవ్రతుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. రాత్రికి మచిలీపట్నం -కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో రేపు కోస్తా జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం. శ్రీకాకుళం, విజయనగరం,విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ కోరారు.

 శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు.. మరో 72 గంటల పాటు తుఫాన్‌ ముప్పు పొంచి ఉంది.  విజయవాడపై మొంథా తుఫాన్ పంజా విసరనుంది. దీంతో ఇవాళ విజయవాడ పూర్తిగా బంద్ నిర్వహించనున్నారు. ఈ మేరకు NTR జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు ఆదేశాలు జారీ చేశారు. మెడికల్‌, పాలు, కూరగాయల షాపులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని కలెక్టర్‌ సూచించారు.

తెలంగాణపై మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్‌

మొంథా తుపాన్ ప్రభావం తెలంగాణపై కూడా ఉండనుంది. ఇవాళ, రేపు తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.-పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం..నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ..యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి.. నాగర్‌కర్నూలు జిల్లాల్లో భారీ  వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.రేపు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్‌ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
రైళ్ల రాకపోకలకు అంతరాయం
 
మొంథా తుఫాన్ విజృంభిస్తుండటంతో రైళ్ల రాకపోకలపై ఎఫెక్ట్‌ పడనుంది. దీంతో ఇవాళ, రేపు వందకుపైగా రైళ్లను రద్దు చేస్తూ సౌత్‌ సెంట్రల్‌ రైల్వే కీలక ప్రకటన జారీ చేసింది.విజయవాడ, కాకినాడ, భీమవరం, ఒంగోలు, హైదరాబాద్‌ మధ్య నడిచే...పలు ప్యాసింజర్, స్పెషల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భువనేశ్వర్ నుంచి బెంగళురు వెళ్లే 18463,సికింద్రాబాద్‌ వెళ్లే 17015, పుదుచ్చేరి వెళ్లే 20851 నంబరు రైళ్లు..రద్దయ్యాయి. సికింద్రాబాద్‌- విశాఖపట్నం - 12740, మహబూబ్‌నగర్‌- విశాఖపట్నం - 12862, హైదరాబాద్‌ - విశాఖపట్నం 12728, మచిలీపట్నం - విశాఖపట్నం 17219,  చెన్నై సెంట్రల్‌- విశాఖపట్నం 22870, విజయవాడ- కాకినాడ పోర్ట్‌ 17257 వెళ్లే రైళ్లు రద్దు చేశారు.

 తిరుపతి - విశాఖపట్నం 22708, గుంటూరు - విశాఖపట్నం 22876,విశాఖపట్నం -గుంటూరు 22875, కాకినాడ పోర్ట్‌ - విశాఖపట్నం 17267,  విశాఖపట్నం - కాకినాడ పోర్ట్‌ 17268, కాకినాడ పోర్ట్‌ - విజయవాడ 17258,రాజమండ్రి - విశాఖపట్నం 67285 , విశాఖపట్నం- రాజమండ్రి 67286 రైళ్లు పూర్తిగా రద్దు చేశారు.విశాఖ మీదుగా రాకపోకలు సాగించే 29 రైళ్లు ఇవాళ, రేపు రద్దు చేశారు.విశాఖ -గుంటూరు డబుల్‌ డెక్కర్‌ (ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌), భువనేశ్వర్‌-బెంగళూరు (ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌), భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌ (విశాఖ ఎక్స్‌ప్రెస్‌) రద్దు చేశారు.

Advertisment
తాజా కథనాలు