Rains : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..మరో నాలుగు రోజులు వర్షాలు!

ఏపీ, తెలంగాణలను వానలు వీడటం లేదు.ఈనెల 22వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ పేర్కొంది.

hyd
New Update

Rains: ఏపీ, తెలంగాణలను వానలు వీడటం లేదు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత కొన్ని రోజుల నుంచి ఏపీలో భారీగా వానలు పడుతున్న సంగతి తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం తీరం దాటింది. దీని ప్రభావం వల్ల ఇంకా కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతునే ఉన్నాయి.

Also Read: హీరోయిన్ తమన్నా ఈడీ విచారణ..బెట్టింగ్ యాప్ కేసులో ప్రశ్నలు

 ఈ క్రమంలోనే ఈనెల 22వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ కోస్తాకు ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా తమిళనాడులో అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఐఎండీ పేర్కొంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. పశ్చిమ దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పింది.

Also Read: ఓపికగా ఆడలేరా.. గంభీర్ టీమ్‌పై మాజీలు ఫైర్.. పూజారా కావాలంటూ!

రాబోయే 4 రోజుల పాటు

ఇక ఈనెల 22వ తేదీన మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న మరో అల్పపీడనం కారణంగా.. ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వర్గాలు తెలిపింది. దీని వల్ల అనంతపురం, సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి , కోనసీమ జిల్లాతోపాటు,  ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నంద్యాల, జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వెల్లడించింది. ఇక ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణపైనా ఉంటుందని తెలిపింది. రాబోయే 4 రోజుల పాటు తెలంగాణలో వానలు పడుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వివరించింది. 

Also Read: ఒక్కడు కాదు చాలామందే..అమ్మవారిపై దాడి కేసులో సంచలన నిజాలు.

భారీ వర్షాలు పడే అవకాశాలు..

 శనివారం..  శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Also Read: అతి మామూలు షెల్ దాడిలో చనిపోయిన హమాస్ అధినేత

ఆదివారం నాడు.. శ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, కోనసీమ, తూర్పుగోదావరి, ప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు.. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వెల్లడించింది.

సోమవారం .. శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి , అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, శ్రీకాకుళం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు,విజయనగరం,  తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా,  జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe