ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురికి నోటీసులు!

AP: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని కోరారు. కాగా తిరుమల మాఢవీధుల్లో పబ్లిక్‌ న్యూసెన్స్ చేస్తూ రీల్స్‌ చేశారని టీటీడీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Duvvada Srinivas
New Update

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురికి పోలీసులు షాక్ ఇచ్చారు. వాళ్లకు నోటీసులు అందించారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు విచారణకు రావాలని కోరారు. కాగా  తిరుమల మాఢవీధుల్లో పబ్లిక్‌ న్యూసెన్స్ చేస్తూ రీల్స్‌ చేశారని టీటీడీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 292, 296, 300 సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా వీరు విచారణకు హాజరవుతారా లేదా అనేది వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: బ్లాక్‌లో టీటీడీ వీఐపీ దర్శన టికెట్లు.. ఎమ్మెల్సీపై కేసు నమోదు!

ఇటీవల కేసు నమోదు...

ఇది కూడా చదవండి:ఏపీకి అలర్ట్.. మరో అల్పపీడనంతో భారీ వర్షాలు 

ఇటీవల మాధురి మీద తిరుమల వన్ టౌన్ లో కేసు నమోదు అయింది. మతవిశ్వాసాలు దెబ్బతీసే విధంగా ఆమె తిరుమల మాడవీధిలో రీల్స్ చేశారని ఆలయ విజిలెన్స్ అధికారి ఫిర్యాదు చేశారు. బ్రహ్మోత్సవాల‌ సమయంలో తిరుమల పవిత్రతను దెబ్బ తీసేలా ప్రవర్తించారని ఫిర్యాదులో తెలిపారు. దీంతో మాధురి మీద.. BNS 292,296, 300 సెక్షన్ 66 -2000-2008 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇది కూడా చదవండి:  ఐదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు గ్యాంగ్ రేప్!

దువ్వాడ శ్రీనివాస్, వాణి, మాధురిల వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో కలిసి జీవిస్తున్నాడనే అనుమానంతో దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, ఆమె బిడ్డలు ఇంటిముందు బైఠాయించారు. ఈ విషయంపై నోరు విప్పిన దివ్వెల మాధురి తాను దువ్వాడ శ్రీనివాస్‌కి ఒక ఫ్రెండ్ మాత్రమేనని మీడియా ముందు తెలిపారు. అయితే మరోవైపు దువ్వాడ శ్రీను మాత్రం తాను తన భార్య వాణితో కలిసి జీవించడం లేదని.. మాధురితో జీవిస్తున్నానని తెలిపాడు. ఇలా శ్రీనివాస్, వాణి, మాధురిల వివాదం ప్రతి రోజూ పెరుగుతూ వచ్చింది. 

ఇది కూడా చదవండి:తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe