/rtv/media/media_files/2025/04/10/qfW7CH4yNVjK9sZFODGO.jpg)
Special prayers for pawan son mark
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లోని స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు పవన్ కొడుకు త్వరగా కోలుకోవాలంటూ తమ విషెష్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో జనసైనికులు పవన్ కుమారుడి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో మృత్యుంజయ హోమం జరిపించారు. అలాగే తాడిపత్రి అపర్ణాదేవి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జనసైనికులు మీడియాతో మాట్లాడుతూ.. పవన్ చేసిన మంచే ఆయన కొడుకుకు తిరిగి వచ్చిందని అన్నారు. ఏపీలో పవన్ భవన నిర్మాణ కార్మికులకు చేసిన మేలు.. అదే భవన నిర్మాణ కార్మికుల చేత తన కొడుకును రక్షించేలా చేసిందని తెలిపారు.
హెల్త్ అప్డేట్
ఇదిలా ఉంటే.. మార్క్ శంకర్ ప్రస్తుతం సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా పవన్ టీమ్ మార్క్ ఆరోగ్యంపై అప్‌డేట్ విడుదల చేసింది. అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిపారు. ఎమర్జెన్సీ వార్డు నుంచి బయటకు మార్చినట్లు పవన్ కళ్యాణ్ టీమ్ వెల్లడించింది. మరో మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షనలో ఉంచాలని సూచించినట్లు తెలిపారు. స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ చేతికి, కాలికి గాయాలవడంతో పాటు ఉపిరితిత్తులోకి పొగ చేరింది.
telugu-news | latest-news | pawan kalyan son | pawan kalyan son accident