/rtv/media/media_files/2025/11/09/pawan-kalyan-2025-11-09-19-57-44.jpg)
Pawan Kalyan
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. పలమనేరు సమీపంలోని ముసలిమడుగు వద్ద పవన్ కాన్వాయ్ ఓ మహిళ కాలిపై నుంచి దూసుకెళ్లింది. అనంతరం గమనించిన స్థానికులు ఆమెను పక్కకి జరిపి హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
మహిళ కాలు పై నుండి వెళ్ళిన పవన్ కళ్యాణ్ వాహనం... బాధతో మహిళ విల విల... పట్టించుకోకుండా పోయిన పవన్ కళ్యాణ్.... 😭😭😭 pic.twitter.com/OqnTRQIxxp
— దల్లి రాజు (@raju_dalli) November 9, 2025
Chittoor Musali Madugu
పలమనేరు సమీపంలో ఉన్న కుంకీ ఏనుగుల క్యాంపు సందర్శన కోసం ఇవాళ పవన్ కళ్యాణ్ ముసలిమడుగుకు వెళ్లారు. అక్కడ ఆయన్ను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు, స్థానికులు రోడ్డుకు ఇరువైపులా చేరుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఓ మహిళ కిందపడిపోయింది.
దీంతో అటువైపుగా వచ్చిన పవన్ కళ్యాణ్ కారు.. ఒక్కసారిగా పడిపోయిన ఆ మహిళ కాలిపై నుంచి దూసుకెళ్లింది. వెంటనే ఆ మహిళ నొప్పితో అరవగా.. గమనించిన స్థానికులు ఆమెను వెనక్కి లాగారు. అనంతరం ఆ మహిళను హాస్పిటల్‌కు తరలించారు.
ఆమె కాలికి తీవ్ర గాయమైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. అభిమానుల తాకిడి, భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Follow Us