Pawan Kalyan: వన్యప్రాణులను వేటాడేవారిపై కఠినంగా వ్యవహరించాలి

చిత్తూరు జిల్లా కౌండిన్య అభయారణ్యంలో చిరుత పులులను చంపుతున్న ఘటన పై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ‘ఇది అమానవీయమైన, కలతపెట్టే నేరం అని అన్నారు. అత్యంత హేయమైన చర్య ఇది’ అని పవన్ అన్నారు.

Pawan Kalyan: గ్రామపంచాయతీ నిధులపై శ్వేతపత్రం: పవన్ కళ్యాణ్
New Update

Pawan Kalyan: చిత్తూరు జిల్లా  కౌండిన్య అభయారణ్యంలో చిరుత పులులను చంపుతున్న ఘటనలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్  ఆదేశాలు జారీ చేశారు. చిరుత పులిని దారుణంగా చంపిన ఘటనపై మంగళవారం సాయంత్రం అటవీ శాఖ ఉన్నతాధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. 

Also Read: దూసుకొస్తున్న దానా..బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం!

ఇది అమానవీయమైన...

చిరుతను చంపడంపై పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.చిరుతపులి గోళ్ల కోసం నాలుగు కాళ్లను విరిచేశారని, దాని దంతాలు కూడా తొలగించారని తెలుసుకొని ‘ఇది అమానవీయమైన, కలతపెట్టే నేరం అని అన్నారు. అత్యంత హేయమైన చర్య ఇది’ అని పవన్ అన్నారు.

Also Read: ఏపీలో టీడీపీ నేత దారుణ హత్య

కౌండిన్య అభయారణ్యం, తాళ్ళమడుగు అటవీ ప్రాంతంలో చిరుతల అనుమానాస్పద మరణాలపై పకడ్బందీగా విచారణ చేసి నేరస్తులను గుర్తించాలని స్పష్టం చేశారు.  

Also Read: షర్మిల, విజయమ్మకు జగన్ షాక్.. పిటిషన్!

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అన్ని వన్యప్రాణుల వేట ఘటనలపై సవివరమైన నివేదిక ఇవ్వాలని వైల్డ్ లైఫ్ విభాగం అధికారులను ఆదేశించారు. వన్న్య ప్రాణులను వేటాడటం, వాటి అవయవాలతో వ్యాపారాలు చేసేవారిని ఏ మాత్రం ఉపేక్షించవద్దని, కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్‌లో వన్యప్రాణుల వేట, స్మగ్లింగ్ లాంటి నేరాలను సహించేది లేదని నేరగాళ్లకు బలమైన సంకేతాలు వెళ్ళేలా కేసులుపెట్టాలని పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు.

 

ఏపీ కేబినెట్ భేటీ.. సంచలన ప్రకటన 

ఈరోజు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ తో సహా ఇతర మంత్రులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఇసుక సీనరేజ్ రద్దు నిర్ణయాన్ని మంత్రి వర్గం ఆమోదించి.. ఉచిత ఇసుక విధానానికి సవరణ చేయనుంది ప్రభుత్వం. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అలాగే కొత్త రేషన్ కార్డుల జారీ, వాలంటీర్ల కొనసాగింపు, రేషన్ డీలర్ల నియామకం, పోలవరం పనులపై చర్చ, దేవాలయాల పాలక మండలి సంఖ్య పెంపుపై చర్చించనున్నారు. దీంతో పాటు అమరావతిలో ప్రాజెక్టులపై మంత్రి వర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఏపీలో అదికారంలో వచ్చిన దాదాపు 120 రోజులు గడుస్తున్న నేపథ్యంలో ఈ భేటీ కీలకం కానుంది. 

రాష్ట్ర బడ్జెట్ పై చర్చ!...

ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర పూర్తి  స్థాయి బడ్జెట్ పై చర్చించనున్నారు. కాగా పూర్తి స్థాయి బడ్జెట్‌ను నవంబరు రెండో వారంలో ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు సర్కార్ సిద్దమైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా గత ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను సమర్పించింది. కాగా మరో రెండ్రోజుల్లో దీనిపై బడ్జెట్ తేదీలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే అధికారులు ఆర్థిక బడ్జెట్ ను రెడీ చేసే పనిలో పడ్డారు.  ఆర్థిక వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ సమావేశాల తేదీలు ఖరారు చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే రెండు, మూడు తేదీలు ప్రతిపాదనకు వచ్చినట్లు తెలుస్తోంది. 

ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను..

ఇటీవల ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో  గత వైసీపీ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. మొత్తం రూ.2,86,389 కోట్లతో అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. 2024 ఏప్రిల్‌ నుంచి జులై 31 వరకు నాలుగు నెలల కాలానికి మొత్తం 40 గ్రాంట్ల కింద రూ.1,09,052.34 కోట్లకు ఖర్చు చేశారు.  అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సాధించి జూన్‌ నెలలో అధికారంలోకి వచ్చింది. అయితే జులైలో పూర్తి స్థాయి బడ్జెట్‌ సమర్పించాల్సి ఉండగా... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, ఎన్ని అప్పులున్నాయో తెలియని గందరగోళ పరిస్థితుల్లో.. పూర్తి వివరాలు రాబట్టి ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసింది. కాగా ఆ సమయంలో కూడా చంద్రబాబు సర్కార్  ఓటాన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. కాగా ఈ నవంబర్ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.

 

Also Read: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. లక్షల కోట్లు గోవిందా!

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe