పిఠాపురంలో బాలికపై అత్యాచారం.. స్పందించిన పవన్

AP: పిఠాపురంలో బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై పవన కళ్యాణ్ స్పందించారు. బాలిక కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు

Pawan Kalyan: గ్రామపంచాయతీ నిధులపై శ్వేతపత్రం: పవన్ కళ్యాణ్
New Update

Pawan Kalyan: పిఠాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచార ఘటన పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తన సొంత ఇలాకాలో ఈవిధంగా మైనర్ పై అఘాయిత్యం జరిగిందని తెలిసి చాలా బాధ కలిగించిదని అన్నారు. ఈ దుస్సంఘటన గురించి తెలిసిన వెంటనే బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

ఆ సమయంలో స్ధానికులు అప్రమత్తమై నిందితుణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చిందని.. స్ధానికులు పట్టుకోకపోతే.. నిందితుడు తప్పించుకోనే ఆస్కారం ఉండేదని తెలిపారు. ఈ అమానుష చర్యను సభ్యసమాజం లో ప్రతి ఒక్కరు ఖండించాలని.. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు.

కఠిన శిక్ష...

ముద్దాయికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పవన్. ఇటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా బాధితురాలిని, వారి కుటుంబ సభ్యులకు సహాయసహకారాలు అందచేస్తామని భరోసా ఇచ్చారు. స్థానిక జనసేన నాయకులను కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి, సహాయం అందించాలని కోరారు.

Also Read  :  ఆ డైరెక్టర్ గర్భవతిని చేశాడుః పూనమ్ కౌర్ షాకింగ్ పోస్ట్

#pawan-kalyan #pithapuram #rape-attempt
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe