Pastor Praveen : లారీ కింద పడి.. పాస్టర్ ప్రవీణ్ కేసులో షాకింగ్ సీసీ ఫుటేజ్!

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ప్రవీణ్ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో షాకింగ్ సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది.  చిల్లకల్ల టోల్ ప్లాజా వద్ద బైక్ పై నుంచి ప్రవీణ్ కింద పడ్డారు. తృటిలో లారీ టైర్ల కింద పడే ప్రమాదాన్ని ఆయన తప్పించుకున్నారు.

New Update

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో షాకింగ్ సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది.  చిల్లకల్ల టోల్ ప్లాజా వద్ద బైక్ పై నుంచి ప్రవీణ్ కింద పడ్డారు. మార్చి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తృటిలో లారీ టైర్ల కింద పడే ప్రమాదాన్ని ఆయన తప్పించుకున్నారు. ఆ సమయంలో వెనుక ఓ బస్సు కూడా వచ్చింది.  ఆ బస్సు డ్రైవర్ వెంటనే రైట్ తీసుకోవడంతో ప్రవీణ్ కు పెద్ద ప్రమాదం తప్పింది.  వెంటనే కింద పడిన ప్రవీణ్ ను స్థానికులు పైకి లేపి కూర్చొబెట్టారు.  ఆ తరువాత కాసేపటికే బైక్ తీసుకుని రాజమండ్రి వైపు తన ప్రయాణాన్ని కొనసాగించారు ప్రవీణ్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. 

Also read :  Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసులో పోలీసుల బిగ్ ట్విస్ట్.. ఒకరు అరెస్ట్!

509 గజాల ల్యాండ్ కొనుగోలు

2025 మార్చి 24వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి తన బైక్ పై బయలుదేరారు పాస్టర్ ప్రవీణ్. ఆయన రాజమండ్రికి ఎందుకు వెళ్లారనేదానిపై ఆర్టీవీ చేసిన ఇన్వేస్టిగేషన్ లో కీలక విషయాలు బయటపడ్డాయి.  రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పాస్టర్ ప్రవీణ్ ఇటీవల 509 గజాల ల్యాండ్ కొనుగోలు చేశారు. ఈ ల్యాండ్ ను ఆయన కుమార్తె రిషిక, మేనల్లుడు రాజేష్ లపై కొనుగోలు చేశారు.  మార్చి 12న ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయింది. ప్రవీణ్ రాజమండ్రికి వచ్చే విషయం తన భార్యతో పాటుగా ఆకాష్, జాన్ లకు మాత్రమే తెలుసు.  ఓ సేవ స్వంస్థతో పాటుగా అనాధ పిల్లల కోసం హాస్టల్ నిర్మించాలని ప్రవీణ్ ఈ 509 గజాల ల్యాండ్ కొనుగోలు చేసినట్లుగా తెలిసింది.  

Also read :  Teacher crime: ముద్దులు పెడుతూ డబ్బులు వసూలు.. లేడీ టీచర్ అరాచకాలు!

Also read : Ameenpur : కలిపిన గెట్ టు గెదర్.. చిగురించిన అక్రమ సంబంధం.. సంసారం నాశనం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు