WAR 2 OTT: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి షాక్.. 'వార్ 2' ఓటీటీకి రాదు!

జూనియర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్ కాంబోలో భారీ అంచనాలతో విడుదలైన  'వార్ 2' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సినిమా కథ, కథనం, గ్రాఫిక్స్, పలు యాక్షన్ సీక్వెన్సులు అభిమానులను పూర్తిగా నిరాశపరిచాయి.

New Update
War 2

WAR 2 OTT

WAR 2 OTT: జూనియర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్ కాంబోలో భారీ అంచనాలతో విడుదలైన  'వార్ 2' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సినిమా కథ, కథనం, గ్రాఫిక్స్, పలు యాక్షన్ సీక్వెన్సులు అభిమానులను పూర్తిగా నిరాశపరిచాయి. ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూకి ఇదొక బ్యాడ్ ఛాయిస్ అని అనుకుంటున్నారు. తొలి రోజు బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ తో మొదలైన ఈ చిత్రం. మెల్లిగా స్లో అయ్యింది. శని, ఆదివారాల్లో దేశవ్యాప్తంగా రూ. 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా.. సోమవారం రూ. 16కోట్లకు పడిపోయాయి. దీంతో  నిర్మాతలు నష్టాలను పూడ్చుకోవాలని సినిమాను త్వరగా ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. 

అప్పుడే రాదు

అయితే తాజా సమాచారం ప్రకారం.. 'వార్ 2' ఇప్పట్లో ఓటీటీలోకి రాదని సినీ వర్గాలు తెలిపాయి. 8వారల థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాతే వార్ 2 ఓటీటీలోకి రాబోతుంది. సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది కావున అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. దాదాపు రూ. 200 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. సినిమా బాక్సాఫీస్ వద్ద ఆడకపోవడంతో త్వరగా ఓటీటీలోకి వస్తుంది అంటూ ప్రచారమైన వార్తలన్ని అవాస్తవాలని సినీ వర్గాలు తెలిపాయి. 

కూలీ బాక్స్ ఆఫీస్ హావా.. 

ఇదిలా ఉంటే..  ప్రస్తుతం రజినీకాంత్ కూలీ, వార్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైనప్పటికీ.. కూలీ బాక్స్ ఆఫీస్ వద్ద హావా కొనసాగిస్తోంది. ఐదు రోజుల్లోనే రూ. 400 కోట్లకు పైగా వసూల్లు సాధించి.. వార్ 2 కంటే బాక్స్ ఆఫీస్ రేసులో ముందంజలో ఉంది.

వార్ 2 ఐదు రోజుల్లో ప్రపంచావ్యాప్తంగా రూ. 200 కోట్ల వసూల్లు  రాబట్టినట్లు తెలుస్తోంది. రెండు సినిమాలు మంచి ఓపెనింగ్స్ తో ప్రారంభమైనప్పటికీ.. వీకెండ్ తర్వాత వార్ 2 వసూల్లు గమనీయంగా తగ్గాయి. కూలీ మాత్రం తన వసూళ్లలో నిలకడను చూపించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది లోనూ కూలీ అదరగొడుతోంది. 

వసూల్లు తగ్గుముఖం 

జూనియర్ ఎన్టీఆర్ ఉండడంతో తెలుగులో మంచి ఓపెనింగ్స్ సాధించింది వార్ 2. కానీ తర్వాత సినిమాకు వచ్చిన మిశ్రమ స్పందన, నెగిటివ్ టాక్ కారణంగా వసూల్లు బారీగా పడిపోయాయి. బాలీవుడ్  డైరెక్టర్ అయాన్ ముఖార్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 

Advertisment
తాజా కథనాలు