ఆంధ్రప్రదేశ్ Srisailam: హమ్మయ్యా.. మొత్తానికి శ్రీశైలంలో బోనులో చిక్కిన ఎలుగుబంటి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం పరిధిలోని శిఖరేశ్వరం సమీపంలో భక్తులను పరుగులు పెట్టించిన ఎలుగుబంటి ఎట్టకేలకు బోనులో చిక్కింది. శిఖరేశ్వరం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగు బంటిని అటవీ శాఖ అధికారులు శుక్రవారం తెల్లవారు జామున పట్టుకున్నారు. కొద్ది రోజులుగా శిఖరం ఆలయం పరిసరాల్లో ఎలుగు బంటి సంచరిస్తూ హల్చల్ చేస్తూ భక్తులను హడలెత్తించింది. దీంతో అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అలెన్, రేంజర్ నరసింహులు 3 ప్రత్యేక బోనులు ఏర్పాటు చేశారు. మొత్తానికి ఇవాళ అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఎలుగుబంటి ఎట్టకేలకు బోనులో చిక్కింది. అయితే చిక్కిన ఎలుగుబంటిని ఆత్మకూరు సమీపంలోని వెలుగోడుకు తరలించారు అధికారులు. ఎలుగు బంటిని వెలుగోడు సమీపంలోని సూదం అటవీ ప్రాంతంలో వదలనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. By E. Chinni 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ School Building wall collapsed : కూలిన ప్రభుత్వ పాఠశాల గోడ.. విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా బనగానపల్లె మండల హుసేనాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. బుధవారం మధ్యాహ్నం తరగతి గోడ ఒకటి కూలిపోయింది. అయితే ఆ సమయంలో భోజన విరామ సమయం కావడంతో విద్యార్థులు అందరూ బయటకు వెళ్లారు. అప్పుడు అక్కడ విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పెద్ద శబ్దంతో తరగతి గది గోడ కూలింది. పెద్ద పెద్ద బండరాళ్లు విద్యార్థులు ఉంచిన బ్యాగులపై పడ్డాయి. ప్రాథమిక పాఠశాలలో మొత్తం 38 మంది పిల్లలున్నారు. పాఠశాల భవనం మరమ్మత్తు చేసేందుకు నాడు నేడు కింద రూ.12.5 లక్షలు మంజూరయ్యాయి. అయినప్పటికీ పనులు మాత్రం జరగడం లేదు. By E. Chinni 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Chirutha: నిన్న తిరుమల..ఇవాళ శ్రీశైలం.. హడలెత్తిస్తున్న చిరుతలు ఏపీలో చిరుత పులులు హడలెత్తిస్తున్నాయి. శ్రీశైలం వీరశైవ గురుకులం వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. గట్టిగా కేకలు వేయడంతో చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. చిరుత వీడియోలను సెల్ఫోన్లలో చిత్రీకరించారు భక్తులు. అటు చిరుత సంచారంతో గురుకులం విద్యార్థులు భయం గుప్పిట్లో బతుకున్నారు. అటు తిరుపతిని చిరుత భయాలు వీడడం లేదు. తిరుపతిలో మరోసారి చిరుతపులి కనిపించడం అక్కడి ప్రజలను ఉలిక్కిపడేలా చేసింద. యస్వీ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్లో చిరుత ప్రత్యక్షమైంది. By Trinath 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Villagers stopped MLA Sridevi : వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవికి చేదు అనుభవం.. అడ్డుకున్న గ్రామస్తులు కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి చేదు అనుభవం ఎదురైంది. పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రీదేవి ఖాసీం స్వామి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ క్రమంలో మహిళలు, గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే శ్రీదేవికి వ్యతిరేకంగా నినాదాలు పెద్ద ఎత్తున చేశారు. గ్రామానికి ఏం చేశారని నిలదీశారు. గో బ్యాక్.. డౌన్ డౌన్ ఎమ్మెల్యే అంటూ నినాదాలతో హోరెత్తించారు గ్రామస్తులు. గొడవలు జరిగే అవకాశం ఉందని ముందే సమాచారం అందుకున్న పోలీసులు.. పుచ్చకాయలమడ గ్రామానికి చేరుకున్నారు. ఒక్కసారిగా గ్రామస్తులు అక్కడికి దూసుకు రావటంతో అప్రమత్తమైన పోలీసులు గ్రామస్తులను అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే శ్రీదేవి అక్కడి నుంచి వెనుదిరగారు. ఎమ్మెల్యే వెళ్లిపోవడంలో ఉద్రిక్త వాతావరణం సాధారణ స్థితికి వచ్చింది. By E. Chinni 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Raod Accident: కర్నూలులో రోడ్డు యాక్సిడెంట్.. ఇద్దరు మృతి, మరో ఐదుగురికి గాయాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా హాలహర్వి మండంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయ పడ్డారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. By E. Chinni 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కర్నూలు NIA: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. కర్నూలు, కరీంనగర్లో రైడ్స్ కరీంనగర్లో మళ్లీ NIA సోదాల కలకలం రేపుతున్నాయి. హుస్సేన్పురాకు చెందిన తఫ్రీజ్ ఖాన్ ఇంట్లో సోదాలు చేశారు అధికారులు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI)తో సంబంధాలున్నాయన్న అనుమానంతో తనిఖీలు చేస్తున్నారు. తెల్లవారుజాము 4 గంటల నుంచే సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మస్కట్లో ఉంటున్నారు తఫ్రీజ్ ఖాన్. 6నెలల వ్యవధిలో మూడుసార్లు NIA దాడులు జరిగగా.. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుంది NIA. నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, కోరుట్ల.. తదితర ప్రాంతాల యువతకు PFI శిక్షణ ఇస్తున్నట్టు సమాచారం. By Trinath 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నాకు ఆత్మహత్యే శరణం అంటూ సెల్ఫీ వీడియో! ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్, వన్ టౌన్ సీఐ వెంకట రమణ లు నాతో నగ్న పూజలు చేయించి నన్ను వేధిస్తున్నారంటూ ఓ మహిళ విడుదల చేసిన వీడియోలు ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో కాకపుట్టిస్తుంది By Bhavana 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఇక నుంచి రౌడీయిజం చేస్తే తాటతీస్తా! వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గానికి ఒక సైకో తయారువుతున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఇక పై రౌడీయిజం చేస్తే తాట తీస్తానని..వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ‘సాగునీటి ప్రాజెక్టుల సందర్శన’లో భాగంగా నంద్యాల జిల్లా పర్యటకు వెళ్లిన చంద్రబాబు.. నందికొట్కూరులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. By Bhavana 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వైసీపీ పాలనలో నియోజకవర్గానికో సైకో వస్తున్నాడు..తాట తీస్తా జాగ్రత్త! ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలనలో సైకోలు ఎక్కువ మంది తయారవుతున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. మంగళవారం నుంచి గురువారం వరకు ఏపీ వ్యాప్తంగా ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమాన్ని ఆయన శ్రీకారం చుట్టారు. ఈ రోజు కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. By Bhavana 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn