తోటలో TDP నేత పాడు పని.. బాలికను తీసుకువెళ్లి ఏం చేశాడంటే -VIDEO

కాకినాడ జిల్లా తునిలో దారుణమైన ఘటన జరిగింది.  బాలికపై టీడీపీ నేత అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలియగానే గ్రామస్తులు సదరు టీడీపీ నేతకు బడితపూజ చేశారు

New Update
tdp leader (1)

కాకినాడ జిల్లా తునిలో దారుణమైన ఘటన జరిగింది.  బాలికపై టీడీపీ నేత అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలియగానే గ్రామస్తులు సదరు టీడీపీ నేతకు బడితపూజ చేశారు. ఇంతకు ఏం జరిగిందంటే.. జగన్నాథగిరి గురుకుల బాలికల పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న బాలికకు తాను తాతయ్య వరుస అవుతానంటూ మాయమాటలు చెప్పి..  ఆ బాలికను  స్కూల్ నుండి స్కూటిపై ఓ  నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లాడు టీడీపీ నేత తాటిక నారాయణరావు.

వీడియో తీస్తూ ఉండగా

 అయితే నారాయణరావును తెలియకుండా ఓ వ్యక్తి అతన్ని ఫాలో అవుతూ  వీడియో తీశాడు. దీంతో ఇంతంటి దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వీడియో తీస్తూ ఉండగా బాలిక దుస్తులు వేసుకుంటూ ఉండగా ఆ బాలికను ఏం చేశావ్ అంటూ టీడీపీ నేతను వీడియో తీస్తున్న వ్యక్తి ప్రశ్నించాడు. సమాధానం చెప్పకుండా ఏం చేస్తావో చేసుకో అంటూ ఆ బాలికను బైక్ పై ఎక్కించుకుని పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

గురుకులపాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులను పిలిపించి విచారణ చేపట్టారు. అయితే నారాయణరావు ఇప్పటికే నాలుగైదు సార్లు బాలికను బంధువులంటూ బయటికి తీసుకెళ్లడని హాస్టల్ వర్గాలు విచారణలో వెల్లడించాయి. దీంతో బాలికకు న్యాయం చేయాలంటూ గురుకుల పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు బాలిక కుటుంబసభ్యులు. అయితే కేసును రాజకీయ కోణంలో తప్పుదారి పట్టిస్తున్నారు అంటూ రూరల్ ఎస్ఐ తో బాలిక కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు . ఈ కేసును ఉన్నతాధికారులతో దర్యాప్తు చేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలియగానే  గ్రామస్థులు ఆగ్రహానికి గురయ్యారు. తాటిక నారాయణరావుకు బడిత పూజ చేశారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Advertisment
తాజా కథనాలు