YS Jagan: ఏపీ సీఎం పులివెందుల పర్యటన!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం వైఎస్సాఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందులలో పలు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టేందుకు ఆయన నేడు శ్రీకారం చుట్టునున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం వైఎస్సాఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందులలో పలు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టేందుకు ఆయన నేడు శ్రీకారం చుట్టునున్నారు.
కడప జిల్లా రామాపురంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథశర్మపై టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఉత్తా నరసింహారెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. తన అనుచరవర్గంతో వైసీపీలో చేరేందుకు సాయినాథశర్మ ప్రయాత్నాలు చేయడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చిందని ప్రశ్నించారు APCC చీఫ్ వైఎస్ షర్మిల. గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను మింగడం ఇదే విశాఖపై వైసీపీ విజన్ అని సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.
వివేకాను హత్య చేయించిన జగన్ కు ఓటు అడిగే హక్కులేదని దస్తగిరి షాకింగ్ కామెంట్స్ చేశారు. కడప జైల్లో చైతన్య రెడ్డి తనను ప్రలోభాలకు గురి చేశాడని.. జైల్లోని సీసీ ఫుటేజీని బయటకు తీయాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలోనే జై భీమ్ తరపున పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
వైఎస్ వివేకా కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. నార్కో అనాలసిస్ పరీక్షకు అవినాష్ సిద్ధమా అని టీడీపీ అభ్యర్థి బిటెక్ రవి ప్రశ్నించారు. తాను ఈ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దమ్ముంటే అవినాష్ కూడా నార్కో అనాలసిస్కి ఒప్పుకోవాలని ఛాలెంజ్ చేశారు.
అన్నమయ్య జిల్లా నీరుగుట్టివారిపల్లెలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఆస్తి పంపకాల విషయంలో ఓ కసాయి కొడుకు తన తల్లిదండ్రుల పట్ల మృగంలా ప్రవర్తించాడు. తనను కొట్టవద్దని ఆ తల్లి వేడుకుంటూ దండం పెట్టినా కనికరించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకాను చంపిన దస్తగిరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భరత్ కుమార్ యాదవ్. అతనోక హీరోలా ఫీల్ అవుతున్నాడని వ్యంగ్యంగా మాట్లాడారు. వైఎస్ వివేకాని అత్యంత కిరాతకంగా చంపి సీబీఐ అధికారులకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ వివేకా కూతురు సునితా రెడ్డి.. వైసీపీ ఓటు వేయొద్దు అంటు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. వివేకాను ఓడించిన టీడీపీతో సునీత చేతులు కలిపిందని.. చంద్రబాబు హయాంలోనే వివేక హత్య జరిగిందన్నారు.
నాన్న(వివేక)ను గొడ్డలితో చంపారనే విషయం జగనన్నకు ఎలా తెలుసని నిలదీశారు వైఎస్ సునీత. అవినాష్, భాస్కర్ రెడ్డిని అధికారంలో ఉన్నవాళ్లే రక్షిస్తున్నారని.. ఇందులో జగన్ పాత్రపై విచారణ జరగాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఒక్కరే తనకు మొదటి నుంచి అండగా నిలిచారన్నారు.