BREAKING: కాంగ్రెస్లో చేరిన బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు
బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు షర్మిల.
బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు షర్మిల.
విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ లేదని బతికించారా లేక నిధులు ఇవ్వకుండా చంపాలని చూస్తున్నారా..? అంటూ కేంద్రంపై APCC చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతుతో మూడో సారి గద్దెనెక్కిన మోదీ.. ఆంధ్రుల తలమానికం విశాఖ ఉక్కుపై డబుల్ గేమ్ ఆడుతున్నారన్నారు.
కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పులివెందుల - కదిరి మార్గంలో ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 12 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరు కూలి పని కోసం పులివెందుల వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
కడప జిల్లా అహోబిలాపురంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తండ్రిని చూసేందుకు వెళ్ళిందనే నెపంతో కుమార్తె చేతులపై ఓ కసాయి తల్లి వాతలు పెట్టింది. విషయం తెలుసుకున్న తండ్రి రాముడు కూతురితో కలిసి సింహాద్రిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కడప పన్నుల విషయంలో వైసీపీ కార్పొరేటర్లు ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు టీడీపీ నేతలు. 198 జీవో మాస్టర్ ప్లాన్ తెచ్చింది వైసీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి అప్పు కోసమే వైసీపీ ఆ జీవో తెచ్చిందని.. ఆ నెపాన్ని టీడీపీపై వేయడం సరికాదని హెచ్చరించారు.
AP: ఆరోగ్యశ్రీపై కేంద్ర మంత్రి పెమ్మసాని చేసిన వాఖ్యలపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు ఏపీపీసీసీ చీఫ్ షర్మిల. ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అంటే.. ఆరోగ్య శ్రీ కింద ఇక వైద్యం లేదని చెప్పకనే చెబుతున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో ఆందోళన నెలకొంది. ఇష్టారాజ్యంగా పోస్టుమార్టం చేస్తున్నారంటూ దువ్వూరు తెలుగు గంగ ప్రాజెక్టులో మరణించిన మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. వైద్య సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. పోస్టుమార్టం విషయమై డాక్టర్ గోపాల్ను బాధితులు చితకబాదినట్లు తెలుస్తోంది.
కడప జిల్లా కోడూరులో కాల్పులు కలకలం రేపాయి. వైసీపీ ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాంమోహన్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి లైసెన్స్ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.