Kadapa district: కడప జిల్లా ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్‌లో కలకలం చోటుచేసుకుంది. 8 వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పాము కాటుకు గురయ్యారు. విద్యార్థులు వర్షిణి, పల్లవిని పాము కాటేసింది. మొదట స్థానిక ఆస్పత్రికి తరలించగా.. కానీ వర్షిణి పరిస్థితి సీరియస్ కావడంతో ప్రొద్దుటూరులోని నాగ దస్తగిరి రెడ్డి ఆసుపత్రికి తరలించారు. పల్లవిని కడప రిమ్స్ కు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పల్లవి, వర్షిణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: చిరు, నాగ్, వెంకీలో నాకు ఇష్టమైన హీరో అతనే.. బాలయ్య భలే చెప్పాడుగా!
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో
ఇది ఇలా ఉంటే రీసెంట్ గా.. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోనూ ఓ విద్యార్ధి పాము కాటుకు బలయ్యాడు. ఉన్నత చదువుల కోసం మయన్మార్ కు నుంచి వచ్చిన కొండన్న నాగార్జున విశ్వవిద్యాలయంలో M.A బుద్ధిజం కోర్స్ లో జాయిన్ అయ్యాడు. అయితే ఒకరోజు సాయంత్రం కొండన్న ఏదో రీసెర్చ్ పని కోసం యూనివర్సిటీలో పుట్టగొడుగులను సేకరించేందుకు వెళ్లగా... అతడు పుట్టగొడుగులు సేకరిస్తున్న సమయంలో రక్తపింజర పాము కాటేసింది. విషయం తెలుసుకున్న కళాశాల సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే కొండన్న పరిస్థితి విషమించడంతో మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.
Also Read: నన్ను టచ్ చేస్తావా..? పోలీసులను అఘోరీ ఏం చేసిందో చూడండి
ప్రథమ చికిత్స
ఒక వ్యక్తి పాము కాటుకు గురైనప్పుడు వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. కాటేసిన ప్రాంతం నుంచి రక్తస్రావం ఉంటే, దానిని ఆపడానికి ప్రయత్నించవద్దు, రక్తాన్ని పోనివ్వాలి. ముఖ్యంగా బాధితుడిని ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి. పాము కాటుకు గురైనప్పుడు, ఆసుపత్రిలో యాంటీవీనమ్ ఇంజెక్షన్ ఇవ్వబడుతుంది. ఇది పాము విషం ప్రభావాన్ని తొలగిస్తుంది.
Also Read: వరుణ్, లావణ్య మొదటి పెళ్లిరోజుకు మెగాస్టార్ అదిరిపోయే గిఫ్ట్!.. వీడియో వైరల్
Also Read: బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్.. నిఖిల్ చేసిన పనికి యష్మీ ఎలిమినేటెడ్..!