లడ్డూ కల్తీ ఆరోపణలపై జగన్ సంచలన నిర్ణయం.. 28న అన్ని ఆలయాల్లో..

చంద్రబాబు నాయుడు తిరుమల, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశాడని ఫైర్ అయ్యారు జగన్. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28న పూజల్లో పాల్గొనాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

JAGAN
New Update

తిరుపతి లడ్డూ కల్తీ అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న వేళ వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన చేశారు. తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని ఆసత్య ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు తిరుమల, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశాడని ఫైర్ అయ్యారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28న పూజల్లో పాల్గొనాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

 

ఏపీలో తిరుమల లడ్డూ కల్తీ అంశం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. నాటి వైసీపీ పాలకుల కారణంగానే లడ్డూ కల్తీ జరిగిందని కూటమి సర్కార్ ఆరోపిస్తోంది. ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని సైతం నిర్వహింది. ఈ ఘటనపై విచారణకు సిట్ ను సైతం ఏర్పాటు చేసింది చంద్రబాబు సర్కార్. అయితే.. ఇదంతా చంద్రబాబు కుట్ర అని వైసీపీ ఆరోపిస్తోంది. రాజకీయాల కోసం జరగని దాన్ని జరిగినట్లుగా చంద్రబాబు అబద్ధలు చెబుతున్నాడంటూ వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలోనూ తిరుమల లడ్డూ అంశంపై యుద్ధమే జరుగుతోంది. 

#Tirupati Laddu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి