Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకార ప్రాంతం మార్పు.. కారణం ఇదే.!
చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం అమరావతి నుంచి తాడేపల్లికి మార్చారు. వర్షాలు పడుతుండటంతో.. ప్రధాని, ఇతర రాష్ట్రాల సీఎంలు వచ్చే అవకాశం ఉండటంతో ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని బ్రహ్మానందపురంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేయనున్నారు.