Pawan Kalyan : నేటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష

AP: ఈరోజు నుంచి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నారు. మొత్తం 11 రోజులు దీక్ష చేయనున్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్షను ప్రారంభించనున్నారు.

author-image
By V.J Reddy
ap dept cm
New Update

Prayaschitta Deeksha : నేటి నుంచి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నారు. మొత్తం 11 రోజులపాటు దీక్ష చేయనున్నారు. గుంటూరు జిల్లా నంబూరు వెంకటేశ్వరస్వామి ఆలయంలో దీక్షను ప్రారంభించనున్నారు. దీక్ష తర్వాత తిరుమలకు వెళ్లనున్నారు. గత పాలకుల వికృత పోకడల ఫలితంగా లడ్డూ ప్రసాదం అపవిత్రమైందని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. జంతు అవశేషాలతో మాలిన్యమైందని అన్నారు. ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే అని అన్నారు. 

Also Read :  సింహాచలం దేవస్థానంలో నెయ్యి సీజ్

ఏడుకొండలవాడా..! క్షమించు అంటూ..

అమృతతుల్యంగా... పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని అన్నారు పవన్. ఆయన ట్విట్టర్ లో.. "జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం.లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది. అపరాధ భావానికి గురైంది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను."

Also Read :  నేలపై జాబిల్లి..రెండు నెలలు భూమిపై చందమామ వెకేషన్

"22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. ‘దేవదేవా... నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమ’ని వేడుకుంటాను. భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారు. నా బాధేమిటంటే- తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం. 

నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది. వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించింది. ఇక లడ్డు ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది." అని పేర్కొన్నారు.

Also Read :  అమెరికా అధ్యక్షునితో మోదీ భేటీ!

#pawan-kalyan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe