విడదల రజిని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేశారు. ప్రత్యర్థిపై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత మంత్రి అయ్యారు. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలవ్వడంతో ఒక్కొక్కరుగా టీడీపీ, జనసేన పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పుడు విడదల రజిని సైతం అదే బాటలో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
జనసేన తీర్థం పుచ్చుకోనున్న రజిని!
మాజీ మంత్రి విడదల రజిని వైసీపీకి గుడ్‌బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే జనసేనలోకి వెళతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా పవన్‌ను కలిసేందుకు విడదల రజిని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా బాలినేని శ్రీనివాస రెడ్డి.. రజిని కలిసి చర్చించినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో విడుదల రజిని అనుచరులు రియాక్ట్ అవుతున్నారు. పార్టీ మార్పు లేదంటూ వారు చెబుతున్నారు.
Also Read: దీపావళి ధమాకా.. బిగ్ బాస్ లో సెలెబ్రెటీల సందడి.. ప్రోమో చూసేయండి
పొలిటికల్ ఎంట్రీ
2014 ఎన్నికల సమయంలో విడదల రజినీ ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడి నుంచి రజిని రాజకీయ ప్రస్తానం మొదలైంది. నిత్యం ప్రజల్లో ఉంటూ వారితో కలిసిపోయారు. రజిని తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో చక చకా మాట్లాడటంతో ఆమె ప్రతిభను గుర్తించిన ప్రత్తిపాటి పుల్లారావు 2017లో వైజాగ్ లోని మహానాడులో రజినితో మాట్లాడించారు.
Also Read : అల్లు అర్జున్ కు తెలంగాణ పోలీసుల ఎదురుదెబ్బ..'పుష్ప2' కు ఊహించని షాక్?
అందులో విడదల రజినీ తన ప్రసంగంతో చంద్రబాబు దృష్టిని ఆకర్షించింది. దీంతో ఒక్కసారిగా రజిని పేరు మారుమోగిపోయింది. ఇప్పటికీ అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. ఇలా ఓ వైపు పాపులారిటీ తెచ్చుకుంటూనే మరోవైపు విఆర్ ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టారు. దీంతో 2019 ఎన్నికల్లో తనకు చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. కానీ తనకు టికెట్ ఇవ్వలేనని చంద్రబాబు చెప్పేశారు.
Also Read : తెలుగు స్టార్ హీరోలపై సూర్య షాకింగ్ కామెంట్స్.. ఒక్కొక్కరి గురించి ఒక్కోలా?
వైసీపీలో చేరిక
దీంతో విడదల రజినీ కీలక నిర్ణయం తీసుకున్నారు. వెంటనే వైసీపీ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తొలి ఎన్నికల్లోనే టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుపై 8000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక అదే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన విడదల రజినినీ 2022 ఏప్రిల్ 11న జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆమెకు వైద్య ఆరోగ్య శాఖల మంత్రిగా అవకాశం ఇచ్చారు.
Also Read: డిజిటల్ అరెస్టుల్లో రూ.120 కోట్లు పోగొట్టుకున్న బాధితులు..