/rtv/media/media_files/2026/02/28/kakinada-2026-02-28-15-10-32.jpg)
ఏపీలో దారుణం జరిగింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. క్రాకర్స్ తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ శబ్దం దాదాపు కిలోమీటరు దూరం వరకు వినిపించిందని స్థానికులు చెబుతున్నారు.
18 మంది మృతి
ఈ ప్రమాదంలో 18 కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా చిధ్రమైపోయాయి. మరో 20 మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతుల్లో ఎక్కవ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.
పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని అసలు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో వేట్లపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ వారు ఏమయ్యారో తెలియక బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సీఎం చంద్రబాబు ఆరా
బాణసంచా ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఆయన, తక్షణమే ఘటనాస్థలికి వెళ్లాలని హోంమంత్రిని ఆదేశించారు. ఈ దుర్ఘటనలో నలుగురు సజీవదహనం కాగా, మరికొందరు మంటల్లో చిక్కుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేసి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
Follow Us