Jagan: మరోసారి వైఎస్ కుటుంబంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. తాజాగా జగన్, షర్మిల మధ్య ఆస్తుల వివాదం ముదిరింది. తన సోదరి షర్మిల, తల్లి విజయమ్మపై మాజీ సీఎం జగన్, భారతి పిటిషన్ వేశారు. సరస్వతి కంపెనీ షేర్ల వివాదంపై NCLTలో పిటిషన్ వేశారు. షేర్ల వివాదంపై సెప్టెంబర్ 9న జగన్, భారతి పిటిషన్ ఫైల్ చేశారు. కంపెనీ అభివృద్ధి కోసం తాము కృషి చేశామని పిటిషన్‌లో పేర్కొన్నారు. 2019, ఆగస్ట్ 21 MOU ప్రకారం విజయమ్మ, షర్మిలకు షేర్ల కేటాయించామని.. కానీ వివిధ కారణాలతో కేటాయింపు జరగలేదని వివరణ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో హై టెన్షన్.. ఆ నిర్మాణం కూల్చివేసిన ఆందోళనకారులు!
నవంబర్ 8న విచారణ..
ఇది కూడా చదవండి: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. సంచలన ప్రకటన చేసే ఛాన్స్!
ఇప్పుడు ఆ షేర్లను విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు జగన్. ఈ షేర్ల కేటాయింపు జరగకపోవడంతో వివాదం చెలరేగింది. తన చెల్లి అని పేరుతో ఆరోజు షేర్లు ఇచ్చేందుకు అంగీకారించమని పిటిషన్ లో వివరణ ఇచ్చారు జగన్. ఇప్పుడు ఆమెకు ఇచ్చిన షేర్లను విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయించినట్లు పిటిషన్ లో పేర్కొన్నారు. ఇల్లీగల్ ఆమె మార్చుకునే ప్రయత్నం చేసిందని.. వాటిని విత్ డ్రా చేయాలని జగన్, భారతి పిటిషన్ లో వివరించారు. కంపెనీలో తమకు 51 శాతం వాటా ఉందని డిక్లేర్ చేయాలని వినతి చేశారు. కాగా జగన్ పిటిషన్‌పై నవంబర్ 8న విచారణ జరగనుంది. దీనిపై షర్మిల ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: 80 విమానాలకు బాంబు బెదిరింపులు
ఇది కూడా చదవండి: మూసీ నిర్వాసితులకు సర్కార్ బంపర్ ఆఫర్..200 గజాల స్థలం, రూ.30 లక్షలు..!