AP: వర్ణనాతీతంగా లంక గ్రామాల ప్రజల కష్టాలు.. పసిబిడ్డతో బాలింత పడవ ప్రయాణం..!
కోనసీమ జిల్లాలో లంక గ్రామాల ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. చాకల పాలెం - కనకాయలంక కాజ్వే నీట మునిగిపోయింది. దీంతో స్థానికుల పరిస్థితి దయానీయంగా మారింది. గోదావరి వరద ప్రవాహంలో బాలింత పసిబిడ్డతో పడవ ప్రయాణం చేయాల్సి వచ్చింది.