Andhra Pradesh: దేశ అభివృద్ధిలో యువత కీలకం-ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి

రాబోయే ఐదేళ్లలో మూడో ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదుగుతుందని...దాంట్లో యువతే కీలకం అని అన్నారు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి. యువతలో మంచి నాయకత్వ లక్షణాలు ఉంటే సత్ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. నన్నయ్య యూనివర్సిటీలో జరిగిన యువజన ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు.

author-image
By Manogna alamuru
AP BJP: టీడీపీ బంద్‌కు మద్దతుపై సైబర్ క్రైమ్ పోలీసులకు పురందేశ్వరి ఫిర్యాదు
New Update

MP Daggubati Purandhreswari: 

మార్పు తీసుకురావాలనే తపన, సాంకేతిక పరిజ్ఞానాన్ని విజ్ఞతతో కూడి సరైన విధానాలు ఉపయోగించడం ద్వారా భారతదేశ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడంలో యువత పాత్ర కీలకం కానుందని ఎం. పి. దగ్గుబాటి పురందరేశ్వరి వ్యాఖ్యానించారు. ఈరోజు స్థానిక నన్నయ యూనివర్సిటీ ఆవరణలో జరిగిన యువజన ఉత్సవాలు 2024 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జిల్లాస్థాయి కార్యక్రమంలో పురంధేశ్వరితో పాటూ జిల్లా కలెక్టర్ ప్రశాంతి,  ప్రజా ప్రతినిధులు,  అధికారులు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ భారత దేశ ఖ్యాతి సురక్షితంగా యువత చేతిలో ఉందన్నారు. సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పం, తపన యువత లో ఉండాలన్నారు. ప్రపంచ దేశాల్లో 60% పైగా 35 ఏళ్లు లోపున ఉన్న యువ శక్తి మన ఆస్తి అన్నారు. నేడు ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదిగిన దేశాలు వృద్ధాప్య ఛాయలను కలిగి ఉండగా భారతదేశం ఒకటే భవిష్యత్తు అభివృద్ధికి కొలమానంగా ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో అత్యున్నత శిఖరాల్లో ఉంచేలాగా కృషి చేస్తున్నారు. గతంలో 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారతదేశం నేడు ఐదవ స్థానానికి చేరుకుందని రాబోయే ఐదేళ్లలో మూడో స్థానానికి చేర్చే దిశలో ఆలోచన చేస్తున్నామన్నారు. దేశ జనాభాలో 50% పైగా ఉన్న మహిళల ను ప్రోత్సహించి వారికి సముచిత స్థానం కల్పించాల్సి ఉందన్నారు. మహిళలు రక్తహీనత, అనీమియా ఇతర అనారోగ్య కారణాల వలన బాధపడుతున్నారని పేర్కొన్నారు. భారతదేశ అభివృద్ధి పథంలో నడపడంలో యువత కీలకమైన బాధ్యతలను స్వీకరించాలన్నారు. 

జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ యువతలో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడే విజయాలు సాధ్యం అవుతాయని, సమిష్టిగా పనిచేసి విజయాలను సొంతం చేసుకోవాలి అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన విధానంలో వినియోగించుకోవడం మనపై ఉన్న బాధ్యత అన్నారు. విజ్ఞతతో కూడి సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు దేశ అభివృద్ధిలో వాటి ద్వారా ఒనగూరే ప్రయోజనం అందుబాటులోకి తీసుకుని రావడం లో యువత పాత్ర కీలకం అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని వినూత్నమైన ఆలోచనలకు సృజనాత్మకత జోడించి ఆవిష్కరణ చేపట్టాలని కలెక్టర్ పిలుపునిచ్చారు

శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి,  బత్తుల బలరామ కృష్ణ మాట్లాడుతూ, దేశ అభివృద్ధిలో యువత కీలకమైన పాత్రను చేపట్టాలన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించడంలో యువశక్తి కీలకమన్నారు. రాజమండ్రి నగరంలో దామెర్ల రామారావు ఆర్టిగ్యాలరీ,  రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం,  నేదునూరి గంగాధర్ గ్రంథాలయం వంటి ఎన్నో దర్శనీయ స్థలాలు ఉన్నాయనీ, వాటి గురించి యువత తెలుసుకుని, మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించటానికి తోడ్పడాల్సీ ఉందన్నారు.

యువజన దినోత్సవం ఉత్సవాల సందర్ంగా సాంస్కృతి కార్యక్రమాల విభాగంలో వ్యక్తిగత బృందాల కేటగిరిలో ఫ్లోక్ డ్యాన్స్ కేటగిరిలో పోటీలను నన్నయ్య యూనివర్శటీలో నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందినవారు రాష్ట్ర స్థాయికి ఎంపిక అవుతారని, అక్కడి నుండి జాతీయ స్థాయికి పంపించడం జరుగుతుందన్నారు. జిల్లాస్థాయి యువజన నాలుగు విభాగాలకు సంబంధించి  నేపథ్య విభాగం, సాంస్కృతిక విభాగం, జీవన నైపుణ్యం, యువకృతి విభాగాలకు సంబంధించి మొత్తం1369 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు.

Also Read: Israel: ఇజ్రాయెల్ మీదకు 140 రాకెట్లతో హెజ్బుల్లా దాడి

Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe